కాంగ్రెస్ పార్టీకి అతడే ఒక సైన్యం అన్నట్లుగా మారారు రేవంత్ రెడ్డి. రోజుకు నాలుగైదు నియోజకవర్గాలు చుట్టబెడుతున్నారు. మధ్యలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇతర కార్యక్రమాలకు వెళ్తున్నారు. పార్టీ అగ్రనేతలు వస్తే రిసీవ్ చేసుకుంటున్నారు. పార్టీలో చేరడానికి వచ్చే వాళ్లతో సమావేశం అవుతున్నారు. మీడియా ఇంటర్యూలు ఇస్తున్నారు. కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావులు బీఆర్ఎస్ తరపున చేస్తున్న పనులన్నింటినీ .. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఒక్కరే చేస్తున్నారని అనుకోవచ్చు.
తెలంగాణలో సీనియర్ నాయకులు కొదువలేదు. కానీ వారు రేవంత్ లా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేయలేరు. జనాకర్షక శక్తి అంత గొప్పగా లేదు. కేసీఆర్ ఢీకొట్టగలిగే నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఫలితంగా రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఎదిగారు. రేవంత్ రెడ్డే ప్రత్యేక వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా మంచి జనాదరణ కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం పట్ల ప్రజల్లో పెరిగిన ఆదరణకు ఈ జన నినాదం సాక్ష్యంగా కనిపిస్తోంది. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేయడానికి రేవంత్ సరైన నాయకుడని భావించడం కూడా ఆయన ప్రాధాన్యతను హైకమాండ్ గుర్తించిందనడానికి ఓ కారణం అనకోవచ్చు.
రేవంత్ రాష్ట్రమంతా తిరిగి విస్తృతంగా ప్రచాం చేస్తూ.. కష్టపడుతూంటే.. సీనియర్ నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితమై.. తాము టిక్కెట్లు ఇప్పించుకున్న వారికి కూడా ప్రచారానికి సమయం..ఇతర సాయం కేటాయించలేకపోతున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సీనియర్ నేతలందర్నీ డామినేట్ చేశారని అనుకోవచ్చు.