నిరుద్యోగులను రెచ్చగొట్టడం కాదు..వారిపై అంతగా ప్రేముంటే ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా దీక్షకు కూర్చోండి. మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మేము చూసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సవాల్ బీఆర్ఎస్ కు కూడా బిగ్ అడ్వాంటేజ్ కావడంతో కేటీఆర్ , హరీష్ లు స్పందిస్తారని…అవసరమైతే కీలక ప్రకటన ఏమైనా చేస్తారని నిరుద్యోగులు ఆశించారు.
కట్ చేస్తే, రేవంత్ సవాల్ పై స్పందించకుండా తాజాగా కేటీఆర్ ఇతర విషయాలపై ఎక్స్ లో స్పందించడం నిరుద్యోగులను ఆశ్చర్యపరిచింది. కొద్ది రోజులుగా నిరుద్యోగుల అంశంపైనే స్పందిస్తూ వచ్చిన కేటీఆర్ ఆల్ ఆఫ్ సడెన్ గా వసతి గృహాలలో సమస్యలపై ట్వీట్ చేయడం పట్ల నిరుద్యోగులు కేటీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ రాజకీయాలు అనుకున్నంత రేంజ్ లో పేలడం లేదు. ప్రతిపక్ష రాజకీయాలు స్తబ్దంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ సవాల్ పై స్పందించి కేటీఆర్ , హరీష్ లలో ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆమరణ దీక్షకు పూనుకుంటే బీఆర్ఎస్ కు బిగ్ అడ్వాంటేజ్ అయ్యేదని, కానీ అందివచ్చిన అవకాశం జారవిడుచుకుంటున్నారని అంటున్నారు.
పైగా.. నిరుద్యోగుల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ పై అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తిని కాంగ్రెస్ వైపు మళ్ళించేందుకు రేవంత్ సవాల్ వారికి ఓ మంచి అవకాశం. కానీ, బీఆర్ఎస్ మాత్రం ఆ ఆలోచన చేయకపోవడం పట్ల.. రేవంత్ చెప్తున్నట్లుగా నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ కోరుకుంటున్నది రాజకీయమేనని అంచనాకు వస్తున్నారు.