తెలంగాణలో గేయం, చిహ్నం, విగ్రహం రాజకీయాలు నడుస్తున్నాయి. కేసీఆర్ ముద్ర లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎంత పట్టుదలగా ఉన్నారో తెలంగాణ గేయం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాల మార్పునకు చేస్తున్న కసరత్తే నిదర్శనమని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి అంటూ రంగం లోకి దిగిపోయింది.
చిహ్నంపై ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా అవి రాచరిక పోకడలు అని తనకు తాను నిర్ణయించేసుకుని మార్చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలంటున్నారు. కాకతీయ కళాతోరణం లేదా చార్మినార్ రాచరిక పోకడలని ప్రజలు అనుకోవడం లేదు. వాటినో వారసత్వ సంపదనగానే చూస్తున్నారు.
రేవంత్ రెడ్డి రాజకీయంగా ఇప్పటి వరకూ ప్రతిపక్ష నేతగానే రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఆయన అధికార పార్ట నేతగా రాజకీయాలు చేయాల్సి ఉంది. అలా చేస్తున్నారా లేదా అన్నది తెలియదు కానీ.. తెలంగాణ సెంటిమెంట్ అంశాన్ని మళ్ల రేపడానికి ఓ అవకాశం మాత్రం కల్పిస్తున్నారన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది.
చార్మినార్, కాకతీయ కళాతోరణాలపై రాచరికం అంటూ వ్యతిరేకత పెంచాలనుకోవడం.. కాస్త అతిశయోక్తి లాంటిదే అవుతుంది. ప్రజల్ని కన్విన్స్ చేయడం కష్టం. కేసీఆర్ ను కాదని ప్రజలు రేవంత్ కు చాన్సిచ్చారటే… అది ఖచ్చితంగా కేసీఆర్ ముద్రను చెరిపేయాలని మాత్రం కాదు.. తమ జీవితాల్ని మరింత మెరురుగుపరుస్తారనే. గేయం, చిహ్నం, విగ్రహాలను మారుస్తామని రేవంత్ కొత్తగా చెప్పడం లేదు.. కానీ ఇది సరైన సమయం కాదన్నది ఎక్కువ మంది భావన.