రైతులను ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారు. ఇప్పటికే రాహుల్ సమక్షంలో డిక్లరేషన్ ప్రకటించి.. అది కాగితం కాదు.. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని.. చెప్పించారు. ఇప్పుడు ఆ డిక్లరేషన్‌పై రైతుల్లో చర్చ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం ప్రత్యేకంగా రచ్చబండ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
మే 21 నాడు ప్రతి ముఖ్య నాయకులు ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాలలో రైతు రచ్చబండ నిర్వహించాలని నిర్దేశించారు. 30 రోజులపాటు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ సభలు జరగాలన్నారు. పీసీసీ అధ్యక్షులుగా తాను వరంగల్ జిల్లాలో జయశంకర్ సార్ స్వంత గ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానని ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజక వర్గాలలో 15 మంది ముఖ్య నాయకులను నియమించి రచ్చబండ సభలు విజయవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు.
రాహుల్ గాంధీ పాదయాత్ర మొదట తెలంగాణ లో చేయాలని టీ పీసీసీ తరపున తీర్మానం చేసి పంపనున్నారు. పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఏ మాత్రం చాన్స్ తీసుకోదల్చుకోలేదు. తన వ్యూహం ప్రకారం తాను దూసుకెళ్తున్నారు. ఇతర నేతలు కలసి వస్తే కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు వచ్చే అవకాసం ఉంది.