వైఎస్ ఉన్నప్పుడు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి ఉదారంగా భూమి ఇచ్చారు. అప్పట్లో అంతా క్విడ్ ప్రో కోనే. జర్నలిస్టులకు ఇవ్వడం వల్ల వారికేమీ రాదు కాబట్టి… వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చారు. తర్వాత ఆయన పోయారు. కానీ ఇప్పటికీ ఆ భూమి జర్నలిస్టులకు రాలేదు. రెండు దశాబ్దాలుగా ఆ భూమి వస్తుందని ఇళ్లు వస్తాయని ఎదుురచూస్తున్న జర్నలిస్టులు చాలా మంది రిటైర్ అయిపోయారు. కొంత మంది జీవితాలకే ముగింపు పలికారు. ఇప్పుడు ఆ సమస్యను రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులకు స్థలాలు ఇస్తున్నారు. ఎనిమిదో తేదీన రవీంద్ర భారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి స్థలం అప్పగించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
దాదాపుగా ఇరవై ఏళ్ల కిందట.. ఒక్కో జర్నలిస్టు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వానికి డిపాజిట్ చేశారు. అప్పట్లో రెండులక్షలు అంటే చిన్న మొత్తం. అనేక మంది రెండు రూపాయల వడ్డీలకు తెచ్చుకుని కట్టారు. అప్పట్నుంచి ఆ ఇంటి ఆశ వారిని వెంటాడుతూనే ఉంది. పదేళ్లు కేసీఆర్ మోసం చేశారు. అది కోర్టు కేసుల్లో ఉందని.. వేర స్థలం ఇప్పిస్తామని కూడా మోసం చేశారు. 2018లో ముందస్తు ఎన్నికలకు ముందు ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న కేటీఆర్… తనదీ బాధ్యత అని చెప్పారు.కానీ ఆయన కేసీఆర్ కుమారుడ్నని నిరూపించుకున్నారు. చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రిటైరయ్యే ముందు జస్టిస్ ఎన్వీ రమణ ఆ భూమిపై ఉన్న వివాదాల్ని క్లియర్ చేశారు. అప్పటికీ ఆ ల్యాండ్ జర్నలిస్టులకు ఇవ్వడానికి కేసీఆర్ చేతులు రాలేదు
ఇప్పుడు రేవంత్ రెడ్డి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆ జర్నలిస్టుల రెండుదశాబ్దాల సొంతఇంటి కలను నెరవేర్చేందుకు ఇంటి స్థలాలను పంపిణీ చేస్తున్నారు. ఆ సీనియర్ జర్నలిస్టులు కెరీర్ చివరి రోజుల్లో అయినా తమకు ఓ నివాసాన్ని కల్పించేందుకు సహకరిస్తున్నరేవంత్కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు.