టిక్ టాక్ లో లైకులు అని రేవంత్ రెడ్డి అంటే.. అది టిక్ టాక్ కాదు సార్.. ట్విట్టర్ అని.. ఇంకేం మ్యాటర్ లేనట్లు .. బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేసింది. అది టిక్ టాక్ కాదు ట్విట్టర్ అని రేవంత్ రెడ్డికి తెలియదా?. తెలియదని అనుకుంటే అమాయకత్వమే. పోనీ గుర్తు ఉండదా అంటే.. ఆయన ప్రసంగాలు విన్న వారెవరైనా అలాంటి చాన్స్ లేదని అనుకోవడానికి లేదు. మరి టిక్ టాక్ అని ఎందుకు చెప్పారు ?. అక్కడే ఉంది అసలు లాజిక్.
రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఇతర మీడియా అంతా హైలెట్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా ఏం చేస్తుంది ?. రేవంత్ మాట్లాడిన మాటల్లో మెరిట్స్ ఏమైనా ఉంటే వెలికి తీస్తుంది. సబ్జెక్ట్ తీస్తుంది. అంటే రుణమాఫీ రేవంత్ అంటే ఆ లెక్కలు బయటపెడుతుంది..పెట్టాలి కూడా.కానీ అలాంటి పని చేయకుండా వారికి డైవర్షన్ ఇస్తున్నారు రేవంత్. ట్విట్టర్ కు బదులు టిక్ టాక్ అని.. AWS అమెజాన్ వెబ్ సిరీస్ అని మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. అన్నింటి కంటే ఇదే పెద్ద అంశం అనుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా దాన్ని టేకప్ చేసుకుంటుంది. రేవంత్ చెప్పిన విషయాన్ని ఇతర మీడియాలు ప్రజల్లోకి తీసుకెళ్తాయి. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం.. రేవంత్ టిక్ టాక్ ను ట్విట్టర్ అన్నాడు.. ఆయనకేం తెలియదు అని ప్రచారం చేయడానికి సరిపోతోంది.
ఇటీవల పెట్టుబడుల విషయంలోనూ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన ప్రచారం రివర్స్ అయింది. సన్ పెట్రో కెమికల్స్ ఓనర్ తో ఒప్పందాలు చేసుకోలేదని అతి తెలివి ప్రదర్శించారు. చివరికి దెబ్బతిన్నారు. రేవంత్ రెడ్డిని అతిగా ట్రోల్ చేయాలనుకుంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా .. ఎదురు దెబ్బలు తింటోంది. ఆ పార్టీ ఆతృతను రేవంత్ పక్కాగా ఉపయోగించుకుంటున్నారు.