తెలంగాణ అసెంబ్లీకి ప్రతిపక్ష నేతను రప్పించేందుకు రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు మరోసారి అధికారికంగా ప్రతిపక్ష నతకు ఆహ్వానాన్ని పంపుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంత్రి పొన్నం స్వయంగా అహ్వానిస్తారని ప్రకటించారు. పాలక, ప్రతిపక్షం అంటే శత్రు పక్షం అనే వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించాడని కానీ అలాంటి పరిస్థితిని తాము మార్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అధికారంలో పదేళ్లు కేసీఆర్ సచివాలయానికి రాలేదు…ఎవరినీ కలవలేదని గుర్తు చేసారు. ప్రజలు వారికి ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు.. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే బాధ్యత వారిపై ఉంటుందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ సభ్యులు మాత్రమే కాదు.. 119 మంది సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి పాత్ర వాళ్లు పోషిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ సీఎం ప్లేస్ లో రేవంత్ ను చూసేందుకు ఆసక్తిగా లేరని అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదని చెబుతున్నారు. గతంలో కేటీఆర్ టైగర్ అసెంబ్లీకి వస్తుందని ప్రకటనలు చేసేవారు.అయితే తర్వాత ఏమయిందో కానీ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. వచ్చే ఏడాది ప్రజల్లోకి వస్తారని అంటున్నారు కానీ అసెంబ్లీకి వస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఏడాది కాంలో అసెంబ్లీకి కేసీఆర్ ఒక్క రోజే వచ్చి కాసేపు కూర్చుని వెళ్లారు. ఆ రోజే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.