జరుగుతోంది కాంగ్రెస్ విజయోత్సవాలు. గెలిచి ఏడాది అయిన సందర్భంగా గొప్ప పరిపాలన చేశామని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ కు పూర్తిగా భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. అందులో సందేహం లేదు. అయితే తమ విజయోత్సవాలకు రావాలని కేసీఆర్ కు కాంగ్రెస్ ఆహ్వానం పంపుతోంది. కాస్త వింతగా ఉన్నా ఇది నిజం.
విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటు ప్రకటనను చిదంబరం చేశారు. ఆ గుర్తుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహాన్ని కూడా కొొత్తగా తయారు చేశారు. ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు మాత్రం సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ విగ్రహం విషయంలో బీఆర్ఎస్ నారాజ్ గా ఉంది. కేసీఆర్ గతంలో రూపొందించిన రూపమే అసలైన తెలంగాణ తల్లి అంటున్నారు.
అయినా ఇప్పుడు కేసీఆర్ కూడా పిలుస్తున్నామని ప్రకటించడం .. కేసీఆర్ ను టీజ్ చేయడమేనని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. గతంలో జూన్ రెండో తేదీన నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి కేసీఆర్ ను పిలిచి ఆయన వల్లేనే తెలంగాణ వచ్చిందని సన్మానం చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు ఏడాది అయిందని చేసే సంబరాల్లో కేసీఆర్ ను పిలవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ ను పొలిటికల్ టీజింగ్ చేస్తున్నారని రేవంత్ పై మండిపడుతున్నారు.