రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్ స్పందిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవుతోంది.
పీఏసీ చైర్మన్ ను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నామని ఇటీవల చిట్ చాట్ లో రేవంత్ చెప్పాడు. అసలు ఓటింగ్ ఎక్కడ జరిగిదంని హరీష్ నారాజ్ అయ్యారు. అంతకు ముందు అదానీ విద్యుత్ సహా అనేక అంశాల్లో ఇలాంటి చిట్ చాట్లలో రేవంత్ చెప్పిన మాటల్ని పట్టుకుని బీఆర్ఎస్ నేతలుావేశం తెచ్చుకుంటున్నారు. కానీ రేవంత్ అవన్నీ వ్యూహాత్మకంగా చేస్తున్నారని తమను ట్రాప్ చేస్తున్నారని అర్థం చేసుకోలేకపోతున్నారు.
మీడియా ప్రతినిధుల్లో బీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితమైన గతంలో రేవంత్ చిట్ చాట్ ను కూడా దుర్వినియోగం చేశారు. పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు.. కేటీఆర్, కేసీఆర్ కు సపోర్టుగా మాట్లాడిన శశిథరూర్ పై రేవంత్ తిట్ల పురాణం అందుకున్నారు. చిట్ చాట్ అయినా ఓ జర్నలిస్టు దాన్ని రికార్డు చేసి కేటీఆర్ కు పంపారు. కేటీఆర్ నేరుగా దాన్ని సోషల్ మీడియాలో పెట్టి.. రాహుల్ కు ట్యాగ్ చేశారు. అదో పెద్ద వివాదం అయింది. కానీ రేవంత్ ఇమేజ్ కు ఇసుమంత కూడా నష్టం చేయలేదు.
అప్పట్నుంచి జర్నలిస్టుల్ని కూడా ఎలా ట్యూన్ చేసుకోవాలో రేవంత్ రెడ్డి తెలుసుకుని అలాగే వ్యవహరిస్తున్నారు. చిట్ చాట్ లతో బోల్తా కొట్టిస్తున్నారు. బీఆర్ఎస్కు బీపీ తెప్పిస్తున్నారు.