అభివృద్ధి విషయంలో తనది రాజమౌళి స్టైల్ అని.. ఆర్జీవీలా చేయమంటే చేయబోనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మూసి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన భిన్నంగా స్పందించారు. రాజకీయంగా నష్టం జరిగినా ప్రజలకు చేయాలనుకున్న మేలు చేస్తామని స్పష్టం చేశారు. ఏదో హడావుడిగా చేయనని రాజమౌళి సినిమాల్లా నిర్మాణాత్మకంగా చేసి సూపర్ హిట్ కొడతామని..ఆర్జీవీలా చుట్టేసి అట్టర్ ఫ్లాప్ చూడబోనన్న అర్థంలో ఆయన చెప్పుకొచ్చారు.
ఈ చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసుపైనా స్పందించారు. ‘మాకు దీపావళి అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు’’ అని బీఆర్ఎస్ నేతల గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. రాజ్ పాకాల ఇంట్లో జరిగినది దీపావళి దావత్ అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని దీపావళి దావత్ అలా చేస్తారని తమకు తెలియదని … ఏమీ చేయకపోతే రాజ్ పాకాల ఎందుకు పారిపోయారు? అని ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారో చెప్పాలన్నారు. ఇంటి దావత్లో క్యాసినో కాయిన్స్, విదేశీమద్యం ఎందుకుంటాయని రేవంత్ ప్రశ్నించారు.
కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్ అని రేవంత్ తేల్చేశారు. ఏడాదిలో కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేశానని ఆ తర్వాత బావతో బామ్మర్దిని ఫినిష్ చేస్తానని సెటైర్ వేశారు. ఆ తర్వాత హరీష్‌రావును ఎలా డీల్ చేయాలో తనకు తెలుసన్నారు. బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని.. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతామన్నారు.
అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగామన్నారు.