తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా కాలంగా తమ పార్టీ పెద్ద రాహుల్ గాంధీని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయిందన్న ప్రచారానికి కారణం అయింది. అయితే అలాంటి గ్యాప్ లేదని శనివారం రేవంత్ రెడ్డి చేతలతో క్లారిటీ ఇచ్చారు. టెన్ జనపథ్లో రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. చాలా రోజులుగా రేవంత్ రెడ్డి.. రాహుల్ ను ప్రత్యేకంగా కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి ఆయనకు చాన్స్ వచ్చింది.
కులగణన అనేది రాహుల్ ఆలోచన అని దాన్ని తాము త్రికరణ శుద్ధితో అమలు చేస్తామని రేవంత్ చెబుతున్నారు. దాని కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటానని చెబుతున్నారు. ఈ క్రమంలో కులగణన చేశామని.. పాల్గొనని వారి కోసం మరోసారి చేస్తున్నామని రిపోర్టు రాహుల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలో తీసుకుంటున్న చర్యలు.. అమలు చేస్తున్న పథకాలపైనా రేవంత్ ఓ నివేదికను రాహుల్ కు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. బీసీ కులగణన.. ఎస్సీ వర్గీకరణ చేసినందున రెండు సభలు పెట్టాలనుకుంటున్న రేవంత్ రెడ్డి వాటికి రావాలని రాహుల్ ను పిలిచినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అదానితో ఎక్కువగా క్లోజ్ గా ఉంటున్నారు. ఇది రాహుల్ ను అసంతృప్తికి గురి చేసిందని అందుకే ఆయనతో భేటీకి ఇంత కాలం ఆసక్తి చూపించలేదని అంటున్నారు.అయితే అన్ని ర కాల ప్రయత్నాలు చేసిన రేవంత్ చివరికి గ్యాప్ ప్రచారాలకు పుల్ స్టాప్ పెట్టేందుకు రాహుల్ తో సమావేశమయ్యారు. లోపల ఏం జరిగిందో వారికి తప్ప ఎవరికి తెలియదు. వారి మధ్య గ్యాప్ ఉందో లేదో వారికే తెలుసు. భేటీ కాని కారణంగా గ్యాప్ ఉందని అనుకునే అవకాశం లేకుండా రేవంత్ అ భేటీ పూర్తి చేశారు.