రేవంత్ రెడ్డి పుట్టి పెరిగిన ఊరు నాగర్ కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి పల్లె. ఆయన కొడంగల్ ను రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నప్పటికీ సొంత ఊరుపై మమకారం ఏ మాత్రం తగ్గలేదు. ప్రతీ సారి కుటుంబసభ్యులంతా కొండారెడ్డి పల్లెలోనే దసరా చేసుకుంటారు. ఈ సారి కూడా అంతే. కాకపోతే ఈ సారి ముఖ్యమంత్రి హోదాలో సొంత ఊరికి వెళ్లారు.
సీఎం రేంజ్లోనే తన ఊరికి బహుమతులు తీసుకెళ్లాడు రేవంత్ రెడ్డి. చిరకాలంగా ప్రజలు కోరుకుంటున్న ప్రతి పని.. సిమెంట్ రోడ్ల దగ్గర్నుంచి లైబ్రరీ వరకూ అన్నిపనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిధులు మంజూరుు. అన్నింటికీ శంకుస్థాపనలు చేశారు. వచ్చే ఏడాది దసరాకు మళ్లీ వచ్చినప్పుడు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇప్పటికే కొండారెడ్డి పల్లె ప్రజలకు ఒక్క రూపాయి కరెంట్ బిల్లు రాకుండా ఉండేందుకు అందరికీ సోలార్ కిట్లు బిగించే ఏర్పాట్లు చేశారు.
తమ ఊరి బిడ్డ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడంతో కొండా రెడ్డి పల్లె మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా మురిసిపోతున్నాయి. రేవంత్ కు కనీవినీ ఎరుగని స్వాగతం పలికాయి. సొంత ఊరి ప్రజలు ప్రజల బ్రహ్మరథం పడుతూంటే ఏ ముఖ్యమంత్రికైనా అనంతమైన సంతోషం ఉంటుంది. రేవంత్ కూడా దానికి అతీతుడేమీ కాదు.