మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా ఫిలడెల్ఫియా లో ఎన్నారైలు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం పార్టీ కి చెందిన దాదాపు రెండువందలమందికి పైగా అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమ్ సందర్భంగా ఈ వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని, ప్రశ్నించే గొంతుక రేవంత్ రెడ్డి కి తెలంగాణ సమాజం అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.