స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేయడం కన్నా పూర్తి చేయడం మంచిదని రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని మంత్రి పొంగులేటితో ప్రకటించ చేశారు. కాస్త అటూ ఇటూ అయినా స్థానిక ఎన్నికలు మాత్రం నిర్వహించాలని అనుకుంటున్నారు.
డిసెంబర్ మొదటి వారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. తమ ఏడాది పాలనపై ప్రజాభిప్రాయం పంచాయతీ ఎన్నికల్లో వెల్లడి అవుతుందని ప్రచారం చేసుకోవడానికి ఉపోయగపడుతుంది. స్థానిక ఎన్నికల్లో ఎలా గెలవాలో రేవంత్ రెడ్డి వంటి నాయకుడికి బాగా తెలుసు. సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇతర పార్టీల నుంచి సర్పంచ్‌గా గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. గ్రామంలో పట్టు ఉన్న నాయకులను పార్టీలో చేర్పించుకుని పోటీ చేయిస్తారు.
ఎలా చూసినా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గ్రామాల్లో అంత బలంగా లేదు. ప్రభుత్వం మారగానే చాలా మంది సైడ్ అయిపోయారు. పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఈ కారణంగానే వచ్చాయి. బీజేపీ ఇంకా పల్లెల్లో పాగా వేసే వరకూ ఎదుగలేదు. కింది స్థాయి నాయకత్వం అసలు లేదు. ఈ క్రమంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలను నిర్వహిస్తే స్వీప్ చేయవచ్చని.. తమ పాలనకు ప్రజామోదం లభించిందని చెప్పుకోవచ్చని అనుకుంటున్నారు. పార్ట్ నేతలకూ పదవుల ఆశ తీరుతుంది.