పెట్టుబడుల ఫ్రెండ్లీ స్టేట్‌గా తెలంగాణ ఉంటుందని .. తాము లేకపోతే తెలంగాణకు పెట్టుబడులు రావని కొంత మంది చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు రేవంత రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఎవరి హయాంలో పెట్టుబడులు వచ్చాయన్నది ముఖ్యం కాదని ఎప్పుడు వచ్చినా. ..ఎవరు తెచ్చినా తమ సహకారం విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని భరోసా ఇస్తున్నారు. ఇందు కోసం ఆయన పరిశ్రమల వద్దకు వెళ్లడానికి ఆయన సిద్ధపడుతున్నారు.
తాజాగా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ నిర్మిస్తున్న ప్లాంట్ వద్దకు వెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా రేవంత్ వెంట ఉన్నారు. ఫాక్స్‌కాన్ పురోగతిపై ప్రతినిధు లను సిఎం రేవంత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉన్నాయా అన్న వివరాలుతెలుసుకున్నారు. అక్కడి నుంచే ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లి యూతోనూ సిఎం రేవంత్ వీడియో కాన్ఫరె న్స్లో మాట్లాడారు.
కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించి సిఎం రేవంత్ రెడ్డి సమావేశంలో భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని సిఎం రేవంత్ యాంగ్ లీని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లో నూ పెట్టుబడులు పెట్టాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. 2023లో ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణ లో పెట్టుబడులు పెట్టింది. కొంగర కలాన్‌లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్ నిర్ణయించి పనులు ప్రారంభించింది. లక్ష మందికి ఉపాధి కల్పించేలా తమ ప్రణాళికలు ఉంటాయని ఫాక్స్ కాన్ ఓనర్ చెప్పారు. ల
పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసం నింపేందుకు బయట జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని చెప్పేలా రేవంత్ .. వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఫ్రెండ్లీ ఇమేజ్ పెంచుకునేందుకు ముందడుగు వేస్తున్నారు.