ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను డిప్యూటీ సీఎం చేస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీకి సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీకి మెట్రో కలగానే మారిపోయిందన్న ఒవైసీ.. పదేళ్లు కేసీఆర్ అదిగో…ఇదిగో అంటూ మెట్రో విషయంలో కాలయాపన చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పదేళ్లు ఓపికగా ఉన్నారు. మరో నాలుగేళ్లు ఓపిక పట్టండి.. పాతబస్తీ చంద్రాయణగుట్టకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. చాంద్రాయణ గుట్టకు మెట్రోను విస్తరిస్తామని.. అప్పుడే అక్కడ ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. అయితే..చాంద్రాయణ గుట్ట నుంచి గతేడాది కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని.. అక్బర్ ను కొడంగల్ లో గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
Also Read : డ్యామేజ్ కంట్రోల్ .. దారి తప్పుతున్న కేటీఆర్?
ఈ సమయంలోనే అక్బర్ ను ప్రతిపక్ష నేతగా కాకుండా… డిప్యూటీ సీఎం చేస్తానని రేవంత్ వ్యాఖ్యానించారు. పాతబస్తీకి మెట్రో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు నిధులు మంజూరు చేశామని..భూసేకరణ కూడా పూర్తి అయిందని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇది తన హామీ అని స్పష్టం చేశారు.