సోషల్ మీడియా పోల్ లో తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని.. తాను గట్టిగా కొడతానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గట్టిగా కొడతానని అంటున్నాడని.. సరిగ్గా నిలబడగలడా అని ప్రశ్నించాడు. ఆయన రద్దు అయిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాడన్నారు. వెయ్యి రూపాయల నోటుకు గతంలో చాలా వాల్యూ ఉండేదని.. ఇప్పుడు అ నోటు ఉంటే తీసుకెళ్లి జైల్లో పెడతారని రేవంత్ గుర్తు చేశారు.
ఫామ్ హౌస్ లో ఉండి సోది మాట్లాడటం కాదని ప్రజల్లోకి.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. పోల్ పెడితే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని సంబర పడుతున్నారని.. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసినోడు.. కేంద్ర మంత్రిగా పని చేసినోడు.. టిక్ టాక్ లో ఎక్కువ లైకులు వచ్చాయని సంబర పడుతున్నారన్నాడు. సల్మాన్ ఖాన్ కు.. రాఖీ సావంత్ పోల్ పెడితే…రాఖీ సావంత్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని రేవంత్ సెటైర్ వేశారు.
మైసమ్మకు, జహంగీర్ పీర్ దర్గాలకు మేకపోతులను వదిలినట్లు కేటీఆర్, హరీష్ రావులను కేసీఆర్ వదిలిండని కేసీఆర్ వారిని కంట్రోల్ లో పట్టుకోవాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులకు అభినందించడం ఇష్టం లేకపోతే ఫామ్ హౌస్ లోనే పండుకోవాలని ఎవరూ అడగడం లేదన్నారు. అబ్దదాల వల్లే ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా దారుణంగా ఓడిపోయారని మండిపడ్డారు. ఫౌమ్హౌస్లో ఉండి లెక్కలు చెప్పొద్దన్నారు. కాంగ్రెస్ శ్రేణులు గాలి ఊదితే కేసీఆర్ కొట్టుకుపోతారన్నాని.. తెలంగాణ ప్రజలను అవమానించేలా తులం బంగారానికి ప్రజలు అమ్ముడుపోయారని అన్నందుకు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు మాట కు మాట ఇవ్వడంలో రేవంత్ సరైన వ్యక్తి అనికాంగ్రెస్ నేతలు ఆయన మాటల్ని వైరల్ చేస్తున్నారు.