తెలంగాణ ప్రభుత్వం తరపున ఐదుగురికి పద్మ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ సీఎం అధికారికంగా సిఫారసు చేశారు. అయితే కేంద్రం ఆ ఐదుగురిలో ఒక్కరి పేరును కూడా పరిగణనలోకి తీసుకోలేదు. సొంతంగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి, మంద కృష్ణకు అవార్డులు ప్రకటించింది. ప్రకటించుకుంటే ప్రకటించుకున్నారు .. కనీసం తాను సిఫారసు చేసిన వారిలో ఇద్దరు, ముగ్గురికి అయినా అవార్డులు ఇవ్వాలి కదా అని రేవంత్ ఫీల్ అవుతున్నారు.
మొత్తంగా 139 మందికి పురస్కారాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణకు క వైద్య రంగంలో నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్, ప్రజా వ్యవహారాల్లో మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారానికి గద్దర్ పేరును సిఫారసు చేసింది. విద్యారంగం నుంచి పద్మభూషణ్ అవార్డుకు చుక్కా రామయ్య పేరును.. అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావులకు పద్మశ్రీ ఇవ్వాలని సిపారసులు పంపింది. కానీ ఒక్క పేరును కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు.
రేవంత్ వీరందర్నీ సిఫారసు చేయడానికి రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయి. తెలంగాణ కోసం కొట్లాడిన వీరిని బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని తాము గౌరవిస్తున్నామని చెప్పుకోవడానికి ఈ పేర్లు సిఫారసు చేశారు. అయితే బీజేపీ మాత్రం తాము అనుకున్న వారికే ఇచ్చింది. మందకృష్ణ బీజేపీకి ఓపెన్ గానే మద్దతు ప్రకటించారు కానీ.. ఆయన పదవులకు ఆశపడకుండా తన వర్గం ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నారు. ఆయన ఆ అవార్డు కావాలని అడిగి కూడా ఉండరు.
అయితే మరీ రెండు అవార్డులేమిటని.. మరికొంత మంది గుర్తింపు ఇవ్వాలి కదా అని రేవంత్ వాదన. అందుకే లేఖ కూడా రాస్తానని అంటున్నారు.