తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైలెంటుగా బీఆర్ఎస్ నేతలందర్నీ రౌండప్ చేస్తున్నారు. హరీష్ రావుపై ట్యాపింగ్ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అదేమి ఆషామాషీగా నమోదు చేసిన కేసు కాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. హరీష్ రావు లాంటి నేతపై కేసు నమోదు చేయాలంటే స్పష్టమైన ఆధారాలు ఉండే ఉంటాయని అంటున్నారు. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి .. రైతులకు డబ్బులు పంచుతూ సిద్దిపేటలో హాట్ టాపిక్ గా మారిన సమయంలో ఆయనపై కేసులు పడ్డాయి. జైలుకెళ్లారు. తర్వాత సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ఆయన బాధితుడిగా మారిన వైనంపై కాంగ్రెస్ నేతలకు ఆధారాలు లభించడంతో ఆయన చేతికి ఇచ్చి ఫిర్యాదు చేయించారని చెబుతున్నారు. లేటు అయితే అరెస్టు చేస్తారన్న భయంతో హరీష్ రావు ఒక్క రోజు వ్యవధిలోనే క్వాష్ పిటిషన్ వేశారని.. కుదరకపోతే అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని ఆయన కోరుతున్నారు. ఒక్క హరీష్ రావు మాత్రమే కాదు కేటీఆర్ ఇప్పటికే రౌండప్ అయిపోయారు. ఆయనపై పలుకేసులు ఉన్నాయి. ఇక పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లను ఇరికించాల్సిన పని లేదు. వాళ్లే వచ్చి ఇరుక్కుంటూ ఉంటారు. కేసీఆర్ పై ఇంకా అధికారికంగా ఎలాంటి కేసులు నమోదుకాలేదు కానీ కాళేశ్వరం సహా చాలా రెడీగా ఉంచారు.
ఇలా బీఆర్ఎస్ నేతలందర్నీ ప్లాన్ ప్రకారం రౌండప్ చేస్తున్నారని ఎప్పుడు కావాలంటే అప్పుడు జైలుకు పంపడానికి అవసరమైన సీన్ క్రియేట్ చేసుకుంటున్నారని భావిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు ఇది అర్థమవుతున్నా ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని .. దూకుడుగా వెళ్తూ.. అదే సరైన విధానమనుకుంటున్నారని భావిస్తున్నారు. మొత్తంగా రేవంత్ రాజకీయం బీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెడుతోదంని చెప్పుకోవచ్చు.