కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో కొంత మంది స్వంత వాయిస్ వినిపిస్తున్నారు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లే కాదు ఆయనను ఆదర్శంగా తీసుకున్న వారు కూడా మెల్లగా నోరు విప్పుతున్నారు. దీనిపై రేవంత్ ఫైర్ అయ్యారు. కులగణన అంశంపై గాంధీభవన్‌లో మీటింగ్ పెట్టిన ఆయన పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని సహించే ప్రశ్నే లేదని సంకేతాలు పంపారు. పార్టీ మాట అంటే మాటేనని అది కాదని వేరేది మాట్లాడితే పార్టీ ద్రోహులేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇతర పార్టీల్లో అయితే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో అయితే ఒకరు కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు. ఒక వేళ మాట్లాడితే వారి రాజకీయ భవిష్యత్ ఆ పార్టీతో అంతమైపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతూంటారు. ఈ పరిస్థితి పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా తగ్గడం లేదు. అందుకే రేవంత్ నేరుగా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోది.
పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదని రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు.. కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డికి గుర్తింపు ఇచ్చింది. మీరంతా కష్టపడితేనే నాకు ఈ బాధ్యత వచ్చింది. పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానమని దీన్ని అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.