కేసీఆర్ ఎంత మాట కారో.. ఆయన మాటలకు రేవంత్ కౌంటర్లు ఇవ్వడంతో అంత కంటే ఎక్కువ మాట కాలి. ఈ విషయం ఎన్నికల సమయంలోనే స్పష్టమయింది. ఇప్పుడు మరోసారి అలాంటి పంచ్ విసిరారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ ఫామ్ హౌస్కు నేతల్ని పిలిచి భరోసా ఇస్తున్నారు. ఆయన ఇచ్చే భరోసా వెరైటీగా ఉంటుంది. కాంగ్రెస్ పాలనపై విరక్తి చెంది మళ్లీ బీఆర్ఎస్ కే ఓట్లు వేస్తారని.. ఓపిక పట్టాలని నేతలకు చెబుతున్నారు. ఈ లాజిక్ పై పార్టీ క్యాడర్ కు నమ్మకం కలగాలని విచిత్రమైన పదబంధాలు అల్లుతున్నారు. తాజాగా గురువారం ఆయన పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ” కొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం దోలాడుకుంటా బీఆర్ఎస్ పార్టీకోసం వస్తారని ” కేసీఆర్ చెప్పుకొచ్చారు. అంటే కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేదని.. ప్రజలకు ఆ కష్టాలు గుర్తుకు వచ్చి టార్చ్ లైట్ తో వస్తారని కేసఆర్ భావన.
దీనికి ఢిల్లీలో రేవంత్ కౌంటర్ ఇచ్చారు. అసలు బీఆర్ఎస్ ఎక్కడుందో కేసిఆర్ కూడా టార్చ్ లైట్ వేసుకొని వెతుక్కుంటున్నారని సెటైర్ వేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదని.. టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణలో తెరాస లేదు భారత్ లో బిఆర్ఎస్ అనేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చేశారు. బిఆర్ఎస్ అనేది ఇప్పుడు గతించిన చరిత్ర అని స్పష్టం చేశారు. కేసీఆర్ టార్చ్ లైట్ వ్యాఖ్యలకు రేవంత్ పర్ ఫెక్ట్ కౌంటర్ అయినట్లయింది. ఎందుకంటే.. పార్లమెంట్ ఎన్నిక్లలో బీఆర్ఎస్ ఘోరంగా డిపాజిట్లు కోల్పోయింది. నిజామాబాద్ పార్లమెంట్ మొత్తం మీద కనీసం లక్ష ఓట్లు కూడా సంపాదించలేకపోయారు. మెజార్టీ సీట్లలో డిపాజిట్లు పోయాయి.
అయినా కేసీఆర్ తాము ఇంట్లో కూర్చుంటే గెలిపిచేస్తారని కలలు కంటున్నారు. టార్చ్ లైట్ కథలు చెబుతున్నారు. దానికి రేవంత్ హిలేరియస్ కౌంటర్లు వేస్తున్నారు.