గట్టిగా కొడతానంటున్న కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. నారాయణ పేట జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నన ఆయన కేసీఆర్ గట్టిగా కొడతామంటున్నారని .. ఫుల్లా.. హాఫా అని పశ్నించారు. ఇంట్లో వాళ్లను కొట్టుకోవాలని కాంగ్రెస్ను కొడితే కార్యకర్తలు ఊరుకోరని రేవంత్ హెచ్చరించారు.
కృష్ణా జలాల అంశాన్ని అదే పనిగా ఎత్తుకుని.. చంద్రబాబు నీళ్లెత్తుకుపోతూంటే రేవంత్ మాట్లాడటం లేదని చేస్తున్న వాదనపై రేవంత్ మండిపడ్డారు. వైఎస్ తో .. ఆయన కుమారుడితో కుమ్మక్కయి తెలంగాణ ద్రోహానికి కేసీఆర్ పాల్పడ్డారన్నారు. హరీష్ రావు కేబినెట్ లో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి వైఎస్ నీళ్లుతరలించారని గుర్తు చేశారు. జగన్ కు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి మరీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఐడియా ఇచ్చారన్నారు. ఇంత కంటే తెలంగాణకు ద్రోహం చేసిన వారు ఉన్నారా అని ప్రశ్నించారు.
మహబూబ్ నగర్ సెంటిమెంట్ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఇప్పుడు తాను వచ్చి పనులు చేయిస్తూంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్లు కండల్లో నిప్పులు పోసుకుంటున్నారు వాళ్ళ కడుపులు మండుతున్నాయ్ .. మీరు బాధపడొద్దు కన్నీరు పెట్టుకోవద్దు ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి పాలమూరును అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.