తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సమితిపై.. ఆ పార్టీ అధినేతపై… విమర్శలు చేయమంటే చెలరేగిపోతారు. అలా అని ఆయన చేసే విమర్శలు… అందరూ అనుకుంటున్నారని చెప్పేవి కాదు. కచ్చితంగా లాజిక్ ఉంటుంది. నిజమే… అని ప్రజలు అనుకునేలా ఉంటాయి. కేసీఆర్ సర్కార్‌పై రేవంత్ చేసిన తాజా ఆరోపణ… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో… ఒక్కో ఎమ్మెల్యేకు రూ. కోటి రూపాయలు పంపిణి చేయడం. సెప్టెంబర్ రెండో తేదీన.. నిర్వహించే.. ప్రగతి నివేదన సభ విజయవంతం అయ్యేలా… జనసమీకరణ బాధ్యతలను.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అప్పగిచేందుకు.. బాధ్యతలు దిశానిర్దేశం చేసేందుకు శుక్రవారం.. సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం పూర్తయిన తర్వాత.. వెళ్లేటప్పుడు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఓ బాక్స్ అందించారు. వాటిని ఎమ్మెల్యేలు, వారి గన్మెన్లు మోసుకెళ్తూ మీడియాకు దొరికిపోయారు.
ఆ బాక్సుల్లో…ఎన్నికల ప్రచార సామాగ్రి ఉందని.. టీఆర్ఎస్ చెబుతోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. ఆ బాక్సుల్లో కోటి రూపాయలు పెట్టి పంపిణీ చేశారని… ఆరోపిస్తున్నారు. అంత చిన్న బాక్సుల్లో పెట్టే పార్టీ ప్రచార సామాగ్రి ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పార్టీ జెండాలు, స్టిక్కర్లు అందులో పెట్టి ఇవ్వాలనుకుంటే… అంత గోప్యత ఎందుకని.. గన్మెన్లను పెట్టి మరీ పంపిణీ చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన లాజిక్ తీస్తున్నారు. ఒ బాక్సుల్లో ఒక్కొక్కిరికి రూ. కోటి చెప్పున పెట్టి పంచారని ఆరోపిస్తున్నారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు.. కొంగరకలాన్ సభకు.. భారీగా ప్రజలను తరలించాలని.. కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
నిజానికి ఆ కార్టన్ బాక్సుల్లో ఏముందో.. ఎవరూ బయటకు చెప్పడం లేదు. కానీ రేవంత్ మాత్రం.. అందులో డబ్బులున్నాయని… కాస్తంత మసాలా జోడించారు. రేవంత్ ఆరోపణలను కొట్టి పారేయలేని పరిస్థితి. అలాగని నమ్మకం కూడా కించిత్ కష్టమే. డబ్బులు పంపిణీ చేయాలనుకుంటే..ఏ రాజకీయ పార్టీ కూడా.,.. బహిరంగంగా ఇవ్వదు. అంతా లోపాయికారీ వ్యవహారాలు జరిగిపోతాయి. అలాంటిదేమీ లేకుండా.. లారీలో డబ్బుల కట్టలున్న కార్టన్ బాక్సులు పెట్టి.. ఆఫీసులోనే పంపిణి చేస్తారా ఏమిటి అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్ని అనుమానాలు తలెత్తినా ఇప్పుడు బాక్సుల్లో ఏమున్నాయనే విషయం బయటకు రాదు.