చంద్రబాబు నాయుడు మొదటి ,రెండో టర్మ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ మేలిమలుపు. ఆయన రాజకీయ స్వార్థానికి తగ్గకుండా వ్యవస్థల్ని బలోపేతం చేశారు. అత్యంత సిన్సియర్ అధికారులను కీలక స్థానాల్లో పెట్టి .. దారి తప్పుతున్న పరిస్థితుల్ని గాడిలో పెట్టారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలు ఇబ్బంది పడినా ఆయన పట్టించుకోలేదు. వారు కూడా.. వ్యవస్థకు తగ్గట్లగా మారాలని సలహా ఇచ్చారు. మారగలిగిన వారు మారారు.. లేని వాళ్లు పార్టీ మారిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్క్ చూపిస్తున్నారు.
ప్రజాకోణంలో పరిపాలన చేయడం ఈ రోజుల్లో రాజకీయ నేతలకు ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీట్లోని ముఖ్యమంత్రులకు అంత తేలిక కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రగా అనేక రకాలుగా ఒత్తిళ్లు తెచ్చే వారుంటారు. కానీ తెలగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం.. తాను అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ప్రజాసేవ విషయంలో రాజకీయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో.. ఇతర విషయాల్లోనూ అంతే ప్రాధాన్యత ఇస్తున్నరు. సిన్సియర్ ఆఫీసర్లకు అత్యంత కీలక బాధ్యతలు ఇచ్చి… తన విజన్ ను అమలు చేస్తున్నారు.ఇందు కోసం సొంత పార్టీ నేతల్ని అయినా ఉపేక్షించవద్దని ఆయన సంకేతాలు పంపడం దీనికి సాక్ష్యం.
తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో సీవీ ఆనంద్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన తన బాధ్యతల నిర్వహణలో ఎవరు చెప్పినా వినరు. ఆయనకు రేవంత్ ఏసీబీ, విజిలెన్స్ రెండు బాధ్యతల్ని ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ల దగ్గర నుంచి కింది కింది స్థాయి వరకూ లంచం తీసుకోవాలంటే వణికిపోతున్నారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో ట్రాప్ వేస్తున్నారు. వీరిని కాపాడటానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. తాజాగా హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి తానే చైర్మన్ గా ఉంటూ… మరో కీలక ఐపీఎస్ అధికారి రంగనాథ్‌కు కమిషనర్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఆయన హైడ్రాకు ఇంకా పూర్తి స్వరూపం ఏర్పడకముందే రంగంలోకి దిగిపోయారు. ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నారో ఆయన చెప్పకనే చెప్పారు. దానం నాగేందర్ గగ్గోలు పెట్టినా ఏం ప్రయోజనం ఉండదని తేలిపోయింది.
ప్రజాసౌకర్యాల విషయంలో తాను పడేది లేదని.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులు చేసే వారిని ప్రోత్సహించబోనని రేవంత్ రెడ్డి నేరుగా సందేశాలు పంపుతున్నారు. అయితే రేవంత్ ప్రాంతీయ పార్టీ సీఎం కాదు.. జాతీయ పార్టీ సీఎం. ఆయన పై అనేక రకాల ఒత్తిళ్లు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొంటూ.. తన మార్క్త్ పాన చేస్తారు.. ఎంత కాలం చేస్తారన్నది కీలకం.