బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు అంటూ గులాబీ దళం ఆందోళన చేస్తున్నా, ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. అయితే, విలీనం అయితే తప్పా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ మాత్రం విలీనం జరుగుతుందని, ఫిరాయింపుల కిందకు రాదని గట్టిగా చెప్తున్న తరుణంలో… కొత్తగా పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎంత మంది, చివరి నిమిషంలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరకపోతే ఎలా… అన్న ప్రశ్నలు సహజంగానే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
బండ్ల.. బాగా ఇరుకునపెడుతున్నాడు!
అయితే, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ఇప్పుడు విలీనానికి లింక్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 10మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నా, ఊగిసలాటలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి మరో 16మంది ఎమ్మెల్యేలు అవసరం పడుతుంది.
అనుకోని పరిస్థితుల్లో చేరికల సంఖ్య తగ్గినా, సభ్యత్వాల రద్దుతో బీఆర్ఎస్ బలం కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు విలీనానికి అవరసం అయ్యే సభ్యుల సంఖ్య కూడా తగ్గుతుంది. దీంతో విలీనానికి ఆటంకం ఉండదని… ఒక్క స్ట్రోక్ తో రెండు పనులు అవుతాయన్న అంచనాకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. అందుకే గతంలో తమ సభ్యులైన కోమటిరెడ్డి, సంపత్ లపై వేటు వేయలేదా? అని చెప్తూనే కొంతమంది సభ్యత్వాలు రద్దవుతాయి అని రేవంత్ కామెంట్ చేయటం వెనుక లోతైన ఆలోచన ఇదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.