అవును.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి పరీక్ష పెట్టారు. అసెంబ్లీ రావాలని టెస్ట్ పెట్టారు. శాసన సభ సమావేశాల్లో పాల్గొనాలని ఎన్నోసార్లు కోరినా కేసీఆర్ నుంచి రిప్లై లేకుండా పోయింది. దాంతో కేసీఆర్ ను ఈసారైనా సభకు హాజరయ్యేలా రేవంత్ గట్టిగా ఇరికించేశారు.
రేవంత్ సభా పక్ష నాయకుడిగా ఉండగా.. ప్రతిపక్ష నేతగా సభలో కూర్చునేందుకు కేసీఆర్ మనసు అంగీకరించడం లేదు. పైకి ఇతరత్రా కారణాలు చూపుతున్నా అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా కొట్టేందుకు ఆయనకు అహంభావం అడ్డొస్తుందని ఎక్కువమంది నమ్ముతున్నారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తానని డైలాగ్ కొట్టారు..తాజాగా బీఆర్ఎస్ వర్గాలు స్పష్టత ఇచ్చినట్టే ఇచ్చినా హరీష్ రావు ప్రకటనతో కేసీఆర్ హజరుపై మళ్ళీ సస్పెన్స్ నెలకొంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో మా వ్యూహం మాకు ఉందని పేర్కొనడంతో కేసీఆర్ అసెంబ్లీ కథ మొదటికి వచ్చినట్లు అయింది. ఈ క్రమంలోనే రేవంత్ వ్యూహమో, ఏమో కానీ కేసీఆర్ ను తప్పక అసెంబ్లీకి హాజరయ్యేలా కండిషన్ పెట్టారు.
Also Read : పార్లమెంట్ సమావేశాలు.. కేసీఆర్ సైలెన్స్ కు కారణం ఇదేనా?
కేంద్ర బడ్జెట్ పై ప్రెస్ మీట్ పెట్టి కడిగేసిన రేవంత్…కేంద్రం తీరుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అందుకే కేసీఆర్ తప్పక అసెంబ్లీకి రావాలన్నారు. రాకపోతే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతున్న ప్రచారమే నిజమని నమ్మాల్సి వస్తుందన్న తరహాలో మాట్లాడారు. దీంతో కేసీఆర్ ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లు అయింది. మరి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కేంద్రంపై గళం ఎత్తుతారా..? చూడాలి. ఆయన రాకుంటే జరుగుతోన్న ప్రచారమే నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో కేసీఆర్ అభిప్రాయం ఎలా ఉన్నా ఇప్పుడు రేవంత్ పెట్టిన కండిషన్ తో తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.