బీసీలు ఏకం అవుతున్నారు..తెలంగాణకు ఇక ఆఖరి రెడ్డి సీఎం రేవంత్ అని.. ఇటీవల కొంతమంది బీసీ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ వాటిని స్వాగతిస్తూ మాట్లాడారు.
గాంధీ భవన్ లో నిర్వహించిన కుల గణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.” నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు..మా నాయకుడు ఇచ్చిన హామీని నెరవేర్చే నిఖార్సైన కార్యకర్త”ను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల గణన.. బీసీ ఓట్ల కోసమో , పదవి కోసమో చేయలేదని స్పష్టం చేశారు.
త్యాగాలకు సిద్ధపడే కులాల లెక్కలు తేల్చామని, రాహుల్ లేవనెత్తిన కుల గణన ఆదర్శాన్ని చాటుతూ, కార్యకర్తగా మిగిలేందుకు అయినా సిద్ధమేనన్నారు రేవంత్.
ఇటీవల రాహుల్ – రేవంత్ మధ్య సఖ్యత లేదంటూ విమర్శలు వచ్చాయి. అయినా, వాటిని పట్టించుకోకుండా రేవంత్.. రాహుల్ గాంధీ అప్పగించిన టాస్క్ ను ఫుల్ ఫిల్ చేస్తూ తన, మాట పనితీరుతోనే విమర్శకులకు సమాధానం ఇస్తూ వెళ్తున్నారు.