తెలంగాణ కాంగ్రెస్‌లో ఏకైక మాస్ లీడర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి… పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా… మీడియా ముందుకు రావడం లేదు. శంషాబాద్ లో నిర్వహించిన రాహుల్ గాంధీ సభలో కూడా పాల్గొనకపోవడంతో… అనేక రకాల ఊహాగానాలొచ్చాయి. కానీ.. ఆయన పార్లమెంట్ బరిలో నిలవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకంటున్నట్లు కాంగ్రె్స్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఏ పార్లమెంట్ స్థానంలో అయినా పోటీ చేస్తానని దరఖాస్తు పెట్టుకోలేదు. కానీ.. హైకమాండ్ మాత్రం.. పార్లమెంట్ బరిలో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టాలని నిర్ణయించుకుని రేవంత్ రెడ్డిని కూడా పరిగణనలోకి తీసుకుందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ లేదా.. మల్కాజిగిరి నుంచి పోటీ చేయమని కోరినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరినే..రేవంత్ రెడ్డి ఎంచుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
2014 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి.. కొడంగల్‌లో తన సోదరుడ్ని పోటీకి పెట్టి.. తాను.. మల్కాజిగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డి అయితేనే గెలవగలరని … చెప్పి చంద్రబాబు… మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్‌ను.. మల్లారెడ్డికి కేటాయించారు. మల్లారెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించి .. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండటంతో.. పోటీకి సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. లోక్‌సభకు పోటీపై..రేవంత్ రెడ్డి.. బయటకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులతో.. తనకు పోటీ చేయాలని ఉందన్న ఆసక్తిని కూడా ఎక్కడా వ్యక్తం చేయడం లేదు. ఏదైనా హైకమాండ్ ఆదేశిస్తేనే అనే పద్దతిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానుంది. ఆ తర్వాతే అధికారికంగా రేవంత్ రెడ్డి పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.