పథకాలు అమలు చేయడం లేదని విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రిపబ్లిక్ డే ను ముహుర్తంగా ఖరారు చేసుకుంది. ఒకే రోజు నాలుగు పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ఉచిత విద్యుత్ , రూ.500 గ్యాస్ సిలిండర్ అమలు చేసిది.
గ్రామసభలు, సర్వేలు నిర్వహించిన సర్కార్.. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులను నేటి నుంచి జారీ చేయనున్నారు. లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు పాత రేషన్ కార్డు మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. రైతు భరోసా కింద సాగుకు అనుకూలమైన భూములకు ట్టబడి సాయం కింద ఏడాదికి ఒక్కో ఎకరానికి రూ.12 వేలు అందించనుంది. ఇందుకోసం ఈనెల 20 వరకు సర్వే నిర్వహించిన అధికారులు.. సాగుకు అనుకూలం కాని భూముల లిస్టును గ్రామ పంచాయతీల్లో ఉంచారు. ఈ రోజు ఆదివారం కాబట్టి అర్థరాత్రి దాటిన తర్వాత బ్యాంకుల్లో నగదు జమ అవుతుంది.
రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రెండు విడతల్లో రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క గుంట కూడా భూమి లేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులుగా ఉండనున్నారు. మరో కీలక పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం. మొత్తం 80 క్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల కోసం క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించారు. తొలి విడతగా … అత్యంత నిరుపేదలకు సాయం అందిస్తున్నారు. వారికి ఖాతాల్లో నగదు జమ చేసే అవకాశం.
అయితే పథకాలు అమలు చేయలేదన్న పార్టీలు.. ఇప్పుడు పూర్తిగా అమలు చేయడం లేదని కొత్త వీడియోలతో ప్రభుత్వంపై ఎటాక్ చేసే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండాలన్న సూచనలు ఆ పార్టీ క్యాడర్ నుంచి వస్తున్నాయి.