తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి.. ప్రపంచ పెట్టుబడిదారుల ముందు తెలంగాణ అవకాశాల్ని ఉంచడానికి రేవంత్ రెడ్డి విస్తృతమైన కసరత్తు చేస్తున్నారు. దావోస్లో జరగబోతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం పక్కాగా రెడీ అవుతున్నారు. ఫోర్త్ సిటీని విస్తృతంగా ప్రమోట్ చేసి భారీగా పెట్టుబడులు తీసుకు రావాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఫ్యూచర్ సిటీగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లోని సానుకూలాంశాలను ప్రపంచ వేదికపై ప్రవేశపెట్టేందుకు, ఇండస్ట్రియల్ పాలసీని పెట్టుబడిదారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు.
గత ఏడాది దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి 14 ప్రముఖ కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని.. వీటి ద్వారా రూ.40232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. ఈ 18 ప్రాజెక్టుల్లో దాదాపు 17 ప్రాజెక్టులు గ్రౌండ్ అయితే… పది ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగం పుంజుకున్నాయి.
దావోస్ కంటే ముందు 16 నుంచి 19 వరకు సింగపూర్ లో ముఖ్యమంత్రి టీం పర్యటిస్తారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటన లో ఉంటారు. సింగపూర్ లో స్కిల్ యానివర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరుపుతారు. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఫోర్త్ సిటీని విస్తృతంగా ప్రమోట్ చేసి.. పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించాలని ట్టుదలగా ఉన్నారు.