ఏడాదిగా మంత్రివర్గ విస్తరణపై రేవంత్ సైలెంట్ గా ఉన్నది..బీఆరెస్ ను దెబ్బతీసేందుకేనా? ఎవరెన్ని విమర్శలు చేసినా వ్యూహంలో భాగంగానే రేవంత్ మౌనం వహించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
నేను కొడితే మామూలుగా ఉండదు.. ఉట్టిగా కొట్టడం నాకు రాదు అంటూ ఫామ్ హౌజ్ లో హెచ్చరికలు చేసిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు మరోసారి తన సత్తా ఏంటో చూపించేందుకు సీఎం రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కాదు..తను కొడితే ఎలా ఉంటుందో రుచి చూపించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుకోసం బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై కన్నేసినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఈ ఎమ్మెల్యేలపై ఎప్పటివరకు చర్యలు తీసుకుంటారో చెప్పాలని స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ఇక ఉప ఎన్నికలు తథ్యమంటూ బీఆర్ఎస్ వాయిస్ రైజ్ చేస్తోంది. దీంతో..పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లోనూ ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది.
బీఆర్ఎస్ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో వారికి చెక్ పెట్టేందుకు రేవంత్ తనదైన వ్యూహాల్లో నిమగ్నం అయినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు అంశాల్లో ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేకుండా ఉండేలా..బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేలా మంత్రాంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.నగరానికి చెందిన ఓ మాజీమంత్రి ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం. మరో 16మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరేతే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయం..దీంతో గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారంతీర్చుకోవడంతోపాటు, సరైన సమయంలో బీఆర్ఎస్ ను దెబ్బతీసినట్లు అవుతుందనే ఆలోచనతో రేవంత్ ఆడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.