మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుందని సిఎం రేవంత్ నమ్మకంతో ఉన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై దృష్టి సారించిన సిఎం రేవంత్ రెడ్డి దాని అభివృద్ధికి సంబంధించి విదేశీ సహకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లండన్ తో పాటు దుబాయ్ లోనూ ఈ అంశంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. దుబాయ్‌లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో భేటీ అయ్యారు. దుబాయ్‌లోని సుమారు 70 సంస్థలతో సిఎం రేవంత్ సంప్రదింపులు జరిపారు.
మూసి నది హైదరాబాద్ సిటీ గుండా ప్రవహించి 56 కిలోమీటర్ల పొడవునా మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్భన్ పార్క్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి న మూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి చర్చ లు జరిపారు. పలు సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, హైదరాబాద్‌లో మూసీ రివర్ డెవెలప్‌మెం ట్ ప్రాజెక్టుపై ఆసక్తిని ప్రదర్శించాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయి.
రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును రేవంత్ సందర్శించారు. ఈ ప్రాజెక్టు దుబాయ్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యవహరాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాలను సిఎం అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో హెచ్ఎండీఏ బాధ్యతలు తీసుకున్న ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఐదేళ్లలో మూసీ రివర్ ప్రంట్ ప్రాజెక్టును ఓ రూపానికి తీసుకు వచ్చి తనదైన ముద్ర చూపించాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు