శశిథరూర్ టీఆర్ఎస్ పార్టీ పట్ల సానుకూలంగా మాట్లాడిన విషయంపై మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆయనను గాడిదగా అభివర్ణించారు. నైతికత మరిచిన ఓ జర్నలిస్ట్ చిట్ చాట్‌ను రికార్డు చేసి కేటీఆర్‌కు ఇచ్చారు. కేటీఆర్ ఆ రికార్డును సోషల్ మీడియాలో పెట్టి శశిథరూర్‌ను ఇలా కించ పర్చిన వ్యక్తికి టీ పీసీసీ చీఫ్ పదవి ఇస్తారా అని రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు. ఆ సమయంలో శశిథరూర్‌కు మద్దతుగా కొంత మంది సీనియర్లు వచ్చారు. విషయం పెద్దది కాకుండా వెంటనే రే్వంత్ రెడ్డి శశిథరూర్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. వెంటనే విషయం సద్దుమణిగిపోయింది.
ఇప్పుడు శశిథరూర్‌కు రేవంత్ రెడ్డి అవసరం పడింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ధరూర్ ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు ఏ ఒక్క నేత ఎయిర్ పోర్టుకు వెళ్లలేదు. ఓ పది మంది కార్యకర్తలు మాత్రం ఆయన కోసం జెండాలు పట్టుకుని వచ్చారు. వారిని కూడా రేవంత్ వ్యతిరేక వర్గీయులు మొబిలైజ్ చేశారు. కానీ వారి నేతలు మాత్రం స్వాగతానికి రాలేదు. హైదరాబాద్ వచ్చి ఓటు హక్కు ఉన్న ఏఐసిసి ప్రతినిధుల్ని కలుద్దామని శశిధరూర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే.. తన సమీప బంధువు చనిపోయారని రాలేనని రేవంత్ చెప్పారు.
రేవంత్ సహకరించే చాన్స్ లేదు. తెలంగాణ కాంగ్రెస్‌లో అందరి మద్దతు ఖర్గేకే ఉండనుంది. అయితే రేవంత్ శశిథరూర్‌కు అలా చెప్పిన గంటలోపే గాందీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బీజేపీపై రేవంత్ విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ .. శశిథరూర్‌ను దూరం పెట్టడానికే ఆ కారణం చెప్పారని స్పష్టత వచ్చినట్లయింది. శశిథరూర్‌కు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మద్దతూ లేదు. కేరళలో కూడా ఆయనకు మద్దతు లభించలేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.