రేవంత్ రెడ్డి థింక్ బిగ్ అన్న మాటలను పర్ ఫెక్ట్ గా ఫాలో అయిపోతున్నాయి. ఆయన ఆలోచనలు ఫోర్త్ సిటీ విషయంలో అమరావతి కంటే పెద్దగా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఫార్మా సిటీ పేరుతో పద్నాలగు వేల ఎకరాల వరకూ గత ప్రభుత్వం సేకరించింది. తాజా ఆయన మరో పదహారు వేల ఎకరాలను సేకరించి అతి పెద్ద సిటీగా నిర్మించాలని అనకుంటున్నారు. అమరావతికి సేకరించిందనది దాదాపుగా 33 వేల ఎకరాలు. అంటే అదే స్థాయిలో ఫోర్త్ సిటీకి రేవంత్ సేకరించాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
ఫోర్త్ సిటీ విషయంలో రేవంత్ రెడ్డి చాలా గట్టి లక్ష్యాలను పెట్టుకున్నారు. ఓ ప్రణాళికాబద్దమైన నగరంగా హైదరాబాద్ ఆధారంగా దాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల హబ్‌లను అక్కడ ఏర్పాటు చేయాడానికి ప్రతిష్టాత్మక సంస్థలతో చర్చలు జరిపారు. అవి ఇంకా కొనసాగుతున్నాయి. ఫార్మా రంగానికి పెద్ద పీట వేసేలా చర్యలు ఉన్నా ఇతర ఏఐ సిటీ సహా అనేక టెక్నాలజీ అధికారిత సిటీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి ప్రయత్నం సింపుల్ గా అయిపోయేది కాదు. సొంత నియోజకవర్గం కొడంగల్ లో కొంత భూమిని ఇండస్ట్రీలకు సేకరించడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. ఇప్పుడు ఫోర్త్ సిటీ విషయంలో ఆయన ప్రణాళికలు అమలు చేయాలంటే.. ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఉన్నతమైన ఆలోచనలతోనే ఉన్నారని అనుకోవచ్చు. కానీ దానికి కావాల్సిన ఎగ్జిక్యూషన్ ఆయన స్టైల్లో ఉంటే మాత్రం ఇబ్బందికరమేనని.. రైతులకు మేలు కలిగేలా కొత్త విధానాలతో భూసమీకరణ కోసం ప్రయత్నించాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.