తెలంగాణలో ఇప్పుడు కుల రాజకీయాలు చాలా పై స్థాయిలో నడుస్తున్నాయి. బీసీల మద్దతు కోసం అన్ని పార్టీలు అదే పనిగా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ చేసిన కులగణన సర్వేలో అసలు బీసీల సంఖ్య తక్కువగా వచ్చిందని బీఆర్ఎస్ అనుకూల బీసీ సంఘాలు అంటున్నాయి. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోఓ సమావేశం పెట్టి.. తమ జనాభా యాభై శాతానికిపైగా ఉంటుందని కేసీఆర్ చేసిన సుమగ్ర కుటుంబ సర్వేలో తేలిందని ఇప్పుడు ఎందుకు తగ్గిపోయారని విమర్శించడం ప్రారంభించారు. ప్రభుత్వం చేసిన రిపోర్టును మీడియా ముందు చింపేయడం .. కాల్చేయడం వంటి విన్యాసాలు చేశారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన రిపోర్టు మాత్రమే అధికారికం అయింది. ఎందుకంటే ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదించేశారు. ఇంక ఆ రిపోర్టును బీసీ సంఘాలు చించేసినా.. కాల్చేసినా ప్రయోజనం ఉండదు. మరో ప్రింట్ తీసుకోవచ్చు. గతంలో చేసిన సర్వేలో ఎక్కువ మంది ఉన్నారని వాదించడానికి కూడా అవకాశం లేదు. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మంగా చేసిన కుటుంబ సర్వేను అసెంబ్లీలో పెట్టలేదు. ఆమోదించలేదు. అందులో ఇంత పర్సంటేజీ అని తేలిందని ఓ పీడీఎఫ్ ను.. ఓ ప్రభుత్వ శాఖ వెబ్ సైట్లో ఎవరికీ కనిపించకుండా అందుబాటులో ఉంచారు. ఇప్పుడు అది కూడా తీసేశారు.
కేసీఆర్ ఆ సర్వే వివరాలను రాజకీయంగా ఉపయోగించుకున్నారు కానీ.. ప్రజల కోసంకాదని.. దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదించి ఉంటే చట్టబద్ధత వచ్చి ఉండేదన్నారు. ఇప్పుడు ఆ నివేదికలో బీసీలే ఎక్కువగా ఉన్నారని వాదిస్తున్నారు. నిజానికి ప్రజలు సర్వేలో పాల్గొన్న వారు స్వచ్చందంగా తమ సామాజికవర్గాలను చెప్పుకోవాలి. నేరుగా చెప్పుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపించరు. అందుకే ఇలాంటి సర్వేల్లో ఎంత మంది నిజం చెబుతారన్న సందేహం కూడా ఉంది.