ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అవసరమైనతే ఆర్డినెన్స్ అయినా ఇచ్చి ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో గొప్పగా ప్రకటించారు. కానీ తర్వాత ఆ విషయం మర్చిపోయారు. ఇప్పుడు పదకొండు వేల టీచర్ పోస్టుల నియామకాలు పూర్తి చేశారు. దీనిపై మందకృష్ణ రోడ్డెక్కారు. రేవంత్ రెడ్డి మాదగల్ని మోసం చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్త ర్యాలీలకు పిలుపునిచ్చారు.
మందకృష్ణ పిలుపుమేరకు తెలంగాణ వ్యాప్తంగా మాదిగలు ర్యాలీలు చేశారు. స్వయంగా హైదరాబాద్లో ర్యాలీ చేయాలనుకున్న మందకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. వివాదం ముదరక ముందే రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి.. వెంటనే ఎస్సీ వర్గీకరణపై వన్ మెన్ కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలల్లో వన్ మెన్ కమిటీ రిపోర్టు ఇవ్వాలని.. అప్పటి వరకూ ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని స్పష్టం చేశారు. నివేదిక వచ్చిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.
Also Read : TRSగా మారిస్తేనే ప్రాంతీయ పార్టీ భావన !
ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించినప్పుడే రేవంత్ రెడ్డి వన్ మెన్ కమిటీని నియమించినట్లయితే.. ఈ రిపోర్టు ఈ పాటికి వచ్చేదే. అయితే ఇప్పటికైనా మందకృష్ణ ఆదోళనలోత ఎస్సీ వర్గీకరణకు వన్ మెన్ కమిటీని నియమించినందున.. త్వరలో భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో అయినా మాదిగలకు సరైన ప్రాదాన్యత దక్కుతుందని ఆశపడుతున్నారు.