మూసీపై రచ్చ చేద్దామనుకుని బయలుదేరిన బీఆర్ఎస్, బీజేపీలకు రేవంత్ రెడ్డి ఒక్క సవాల్ తో చెక్ పెట్టేశారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, ఈటల మూసి ప్రక్షాళన కావాలనా… వద్దన్నా ఇబ్బంది పడే పరిస్థితిని రేవంత్ రెడ్డి సృష్టించారు.
మూసి ప్రక్షాళన వద్దని చెబితే భవిష్యత్ లో వచ్చి భారీ వర్షాల వల్ల హైదరాబాద్ మునిగిపోతే ఎవరిది బాధ్యత అని వచ్చే ప్రశ్నకు కేటీఆర్, ఈటల సమాధానం చెప్పాల్సి ఉంది. మూసి ప్రక్షాళన కోసం కేటీఆర్ హయాంలో వేసిన ప్రణాళికలు, ఆయన ఇచ్చిన ఆదేశాలు అన్నీ బయటకు వస్తాయి. అదే సమయంలో హైదరాబాద్ ప్రజల్నే కాదు నల్లగొండ ప్రజలకు కూడా విషం పెడతారా అని.. మూసి పొలిటికల్ షూటింగ్ రేంజ్ ను రేవంత్ పెంచారు. పేదలకు బాసట అంటూ ఈటల రాజేందర్ మూసిలో చేసిన రాజకీయం కూడా సేమ్.
మూసి ప్రక్షాళన చేయాలని.. మురికి కాలువగా మారిన నదిలో ఆక్రమణలు తొలగిస్తే ముంపు ఉండదని ప్రజలు కూడా నమ్ముతున్నారు.. దీనికి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంటుంది. అయితే అక్కడ ఉన్న ఆక్రమణ దారులు అంతా పేదలే. చెరువుల్ని కబ్జాలు చేసి ఫామ్ హౌ స్ లు, బడా అపార్టుమెంట్లు కట్టుకున్న వారికి సమస్య వస్తే పెద్దగా సమస్య ఉండదు కానీ.. మూసీ నిర్వాసితులు ఖచ్చితంగా పేదలే. అందుకే మురికి కూపాల్లో ఉంటున్నారు. వారికి న్యాయం చేయాల్సిందే. చేస్తామని కూడా రేవంత్ అంటున్నారు.
ఇప్పుడు కేటీఆర్, ఈటల ముందు రెండేళ్ల ఆప్షన్లు ఉన్నాయి. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించడం.. లేదా అంగీకరించడం. ఏది చేసిన రాజకీయంగా నష్టమే. మూసి ప్రక్షాళన వ్యతిరేకిస్తే నగరం మొత్తానికి వ్యతిరేకమవుతారు . అందరూ మునిగిపోయినా పర్వాలేదన్నట్లుగా కేటీఆర్ ఉన్నారని అనుకుంటారు. అంగీకరిస్తే రేవంత్ దారిలోకి వచ్చినట్లు అవుతుంది. రేవంత్ విసిరిన రెండు వైపులా పదునున్న అస్త్రాన్ని ఈటల ,కేటీఆర్ ఎలా ఎదుర్కొంటారో?