ప్రజల పవర్.. పవర్లో ఉన్న పాలకుల కంటే పవర్ ఫుల్ అని కేటీఆర్ అంటున్నారు. తన పార్టీ నుంచి వరుసగా వెళ్లిపోతున్నఅత్యంత నమ్మకమైన నేతల గురించి ఆయన ఈ ట్వీట్ చేశారు. నిజానికి ఆయన బాధితుడు అయితే సానుభూతి వచ్చేది. స్వార్థపూరితమైన నేతల్ని ప్రోత్సహించారని ఇప్పుడు వారంతా మోసం చేస్తున్నారని అనుకునేవారు. కానీ కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్కు అలాంటి సానుభూతి రావడం లేదు. మీరు చేసిందేగా… రివర్స్ లో కౌంటర్లు వస్తున్నాయి.
కాంగ్రెస్ ఎల్పీల్ని కేసీఆర్ ఒక సారి కాదు.. రెండు సార్లు విలీనం చేసుకున్నారు. మొదటి సారి పార్టీ కాస్త బలహీనంగా ఉందన్న అభిప్రాయం కల్పించి… అన్ని పార్టీల ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నారు. రెండో సారి అవసరం లేకపోయినా చేర్చుకున్నారు. అందు కోసం అన్ని రకాల టాక్టిక్స్ ప్రయోగించారు. చివరికి ఏ పార్టీని నిర్వీర్యం చేయలేకపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేకపోయారు. టీడీపీని మాత్రం నిర్వీర్యం చేయగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి బీఆర్ఎస్కు వస్తోంది.
పార్టీ డిఫెక్షన్స్ పై ప్రజల్లో కూడా విరక్తి వచ్చేసింది. బీఆర్ఎస్కు అండగా ఉండటానికి.. వారికి మద్దతుగా ఉండేందుకు కూడా ప్రజల్లో ఆసక్తి కనిపించడం లేదు. గతంలో బీఆర్ఎస్ చేససినప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు వెళ్లిపోతూంటే… మాట్లాడితే… మంచిపద్దతి కాదనుకుని సైలెంట్ గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది కేటీఆర్, కేసీఆరే.
అందుకే అంటారు రాజకీయాలు రోలర్ కోస్టర్ రైడ్… అధికారం ఉందని ఇవాళ విర్రవీగితే.. రేపు అదే వారికీ జరుగుతుంది. అప్పుడు ఇదన్యాయం అని ఏడ్చే అవకాశం కూడా ఉండదు.