ఏపీలో జగన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కమిషన్ల ఆశ చూపో… పర్సంటేజీలు ఇచ్చో కానీ మేఘా కంపెనీ గత ఐదేళ్ల కాలంలో ప్రధాన కాంట్రాక్టులన్నీ పొందింది. దానికి రివర్స్ టెండర్ అని ముద్దు పేరు పెట్టుకుని కథ నడిపించారు. ఇప్పుడు మరోసారి రివర్స్ అవబోతోంది. మేఘాకు గట్టిగా రివర్స్ టెండర్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. జగన్ రెడ్డి హయాంలో మేఘా తీసుకున్న కాంట్రాక్టులు ఎన్ని .. చేసిన పనులెన్ని… తీసుకున్న నిధులెన్నీ లెక్కలు తీయబోతున్నారు. తక్కువకు పనులు చేస్తామని రివర్స్ టెండర్లు వేసి.. తర్వాత అంచనాలను పెంచుకున్న వ్యవహారంపై కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
మేఘా కంపెనీ జగన్ రెడ్డి హయాంలో ప్రతి పని చేపట్టింది. ముందుగా పోలవరంలో అడుగుపెట్టింది. ఆ సంస్థకు ఎత్తిపోతలు తప్ప పోలవరం లాంటి ప్రాజెక్టును నిర్మించిన అనుభవం లేదు. అయినా అతి తక్కువకు ఇస్తామని చెప్పి రివర్స్ టెండర్ వేసింది. తర్వాత ఐదు వేల కోట్లు అంచనాలను పెంచుకున్నారు. నిధులు బాగానే వసూలు చేశారు. కానీ పనులు జరగకపోవడం వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు అదంతా మేఘాతోనే భర్తీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క పోలవరం కాదు.. రాయలసీమ ఎత్తిపోతలలో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి డబ్బులు డ్రా చేసుకున్నరు ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది.
ఇక వెలిగండ ప్రాజెక్టు పైనా మేఘా నీడ పడటంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది పనులు జరగలేదు. ఇలాంటి మేఘా వ్యవహారాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రాజెక్టులు మాత్రమే కాకుండా.. .. ఇంకా పలు వ్యవహారాల్లో మేఘా జోక్యం చేసుకుంది. గుంటూరులో ఉన్న ఓ మెడికల్ కాలేజీ ఆస్పత్రిని బెదిరింపులతో స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. ముసుగులో ఇంకా చాలా చేసిందని… మొత్తం లెక్కలు సరి చేసేందుకు ఓ టీమ్ టీడీపీ ప్రభుత్వంలో నిరంతరాయంగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
2014లో టీడీపీ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టును మెఘా కంపెనీ రికార్డు స్థాయిలో పూర్తి చేసి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. జగన్ రెడ్డి హయాంలో పెద్ద స్కామ్స్టర్గా మారింది. ముందు ముందు ఈ కంపెనీకి ఎలాంటి గడ్డు పరిస్థితులు ఉంటాయో అంచనా వేయడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి.