సొంత జిల్లా ప్రజలు అతలాకుతలమైపోయినా సీఎం జగన్ పట్టించుకోలేని తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న తర్వాత రెండు రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి, కడపతో పాటు నెల్లూరు జిల్లాలోనూ పర్యటించారు. అయితే జగన్ పర్యటించిన విధానం మాత్రం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆయన పర్యటనకు నాలుగు రోజుల ముందు నుంచి అధికారులు హడావుడి చేశారు. పర్యటించే ప్రాంతాల్లో బాధితుల్ని చాలా దూరం నిలబెట్టి మాట్లాడించారు. బారికేడ్లు ఏర్పాటుచేసి.. బాదితుల్ని కూలిపోయిన ఇంటి మధ్యలో నిలబడి దూరంగా జగన్‌తో మాట్లాడించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కారణంగా కొట్టుకుపోయిన గ్రామాల్లో బాధితుల్ని కూడా సెలక్టివ్‌గా కొంత మందిని మాత్రమే ముందుగా ఎంపిక చేసిన వారిని చుట్టూ ఉంచుకుని చేయాలనుకున్న ప్రకటనలు చేశారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. తిరుపతిలో సీఎం జగన్ పర్యటన సాదాసీదాగా సాగిపోయింది. అక్కడ బాధితుల్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుందని అనుకున్నారేమో కానీ సగం పర్యటనతోనే సరిపెట్టారు. అధికారులతో సమీక్షచేయాల్సి ఉన్నా… రద్దు చేసుకుని నెల్లూరు వెళ్లిపోయారు.
నెల్లూరులో సీఎం జగన్ పర్యటించిన ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఓ వాలంటీన్ను కాపలా పెట్టారు. ఎవరూ కనీసం నినాదాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతీ చోటా బారికేడ్లు అడ్డం పెట్టారు. ఎవరైనా వ్యతిరేక నినాదాలు చేస్తే దానికి పబ్లిసిటీ వస్తుదంన్న కారణంగా .. అనేక మందిని దగ్గరకు కూడా రానివ్వలేదు. చివరికి పర్యటన ముగిసిందని అనిపించారు. నెల్లూరులో మాత్రం వరద ముంపు రాకుండా కొన్ని చర్యలు చేపడతామని రూ.190కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక తిరుపతిలో కానీ.. కడప జిల్లాలో కానీ ప్రత్యేకంగా బాధితులకు ఇంత సాయం చేస్తామని ప్రకటించలేదు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ప్రజలతో మమేకం అయ్యేవారు. ఎమీ అడ్డంకులు ఉండేవి కావు. సీఎంగా కూడా అలాంటి పరిస్థితిని కొనసాగించాల్సి ఉన్నా… ఆయన మాత్రం.. రిస్ట్రిక్టర్గా ఉంటున్నారు. బారికేడ్లతో పర్యటనలు చేస్తున్నారు. దీంతో ముందు ముందు ఆయన జిల్లాల పర్యటనలు కూడా ఇలాగే చేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి పర్యటనల వల్ల బాధితుల్లో భరోసారాకపోగా.. ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతుందని వైసీపీ వర్గాలే మథనపడుతున్నాయి.