కేంద్ర ప్రభుత్వం దేశ క్రమినల్ చట్టాలన్నింటిని సమూలంగా మార్చేసింది. ఐపీసీ స్థానంలో ఐపీసీ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ను అమల్లోకి తెచ్చింది. జూలై ఒకటి నుంచే అమలు ప్రారంభమయింది. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లను రద్దు చేసి.. వాటి స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు. . ఇక ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చునని.. సెర్చ్ ఆపరేషన్ చేస్తే సెర్చ్ వారెంట్తోపాటు ఎవరి వద్దకైనా వెళ్తే వీడియోగ్రఫీ చేయాల్సిందేనని చట్టాల్లో మార్చారు. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జిషీట్ వరకు అన్ని డిజిటైలైజ్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకూ జీవిత ఖైదు అంటే పధ్నాలుగు ఏళ్లు అనే లెక్కలు వేసేవాళ్లు. కానీ ఇక నుంచి జీవిత ఖైదు అంటే.. జీవించి ఉన్నంత వరకూ అని అర్థం. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చిన్నచిన్న నేరాలకు సంఘసేవను శిక్ష విధించబోతున్నారు. .వేర్వేరు నేరాలకు సంబంధించిన జరిమానాలు, శిక్షలను పెంచారు. మైనర్లను అత్యాచారం చేస్తే ఉరిశిక్ష ,స సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు , మూక దాడులకు ఏడేళ్ల జైలు, 7 సంవత్సరాలకుపైగా శిక్ష విధించే కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాలు తప్పనిసరి అని ఈ చట్టాల్లో ఉంది.
రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు తెచ్చామని కేంద్రం చెబుతోంది. కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికే ప్రాధాన్యం ఇస్తాయని అంటున్నారు. అయితే దేశంలో అనేక కఠినమైన చట్టలు వచ్చాయి. నిర్భయ ఘటన జరిగినప్పుడు భయపడేలా చట్టాలు తెచ్చామని ప్రకటించారు. కానీ అలాంటి నేరాలు తగ్గలేదు. దానికి కారణం అమలులో చిత్తుశుద్దే కీలకం.