‘రేవు’ రివ్యూ: వేటలో చిక్కిందెవరు?

Revu Movie Telugu Review

తెలుగు360 రేటింగ్: 2.5/5

-అన్వర్-

ఈవారం వచ్చిన చిన్న సినిమాల్లో ‘రేవు’ ఒకటి. దిల్ రాజు లాంటి నిర్మాత ‘ఈ సినిమా రివ్యూ నేను రాస్తా’అని చెప్పడంతో కొందరి దృష్టిని ఆకర్షించగలిగింది. అలాగే కంటెంట్ తో సంబంధం లేకపోయినా ‘రేవు పార్టీ’ అని రీల్స్ చేసి సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేయగలిగారు. మరి ఇంతకీ ఈ రేవులో ఏముంది? రేవులో వేటాడింది ఎవరు? వలకి చిక్కిందెవరు?

1993లో కాకినాడకి దూరంగా పాలరేవు అనే తీరప్రాంతం. ఆ వూర్లో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) రెండు జట్లుగా రేవులో వేటకెళ్ళి చేపలు పట్టుకొచ్చి కంపెనీకి అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. ఆ రెండు జట్ల మధ్య వేట పోటాపోటీగా సాగుతుంటుంది. అయితే నగేష్ (హరి) రాకతో లెక్కలు మారిపోతాయి. ఎన్నో అక్రమ వ్యాపారాలు చేసిన నగేష్ తన డబ్బునంత వెచ్చించి ఓ పెద్ద మిషన్ బోటు కొని రేవులో వేటకి దిగుతాడు. ఆ బోటు సముద్రంలో కూడా వేటకి వెళ్ళగలదు. అంకాలు, గంగయ్య లవి నాటుబొట్లు. రేవుదాటి వేట చేయలేవు. నగేష్ వేటలో పెద్ద మొత్తంలో సరుకు దొరుకుతుంటుంది. దీంతో కంపెనీ అంకాలు, గంగయ్య తెచ్చే చిన్న సరకు కొనడం మానేస్తుంది. తమ నాటుబొట్లకి మిషన్ పెడితే సముద్రంలోకి వేటకి వెళ్ళొచ్చనే ఆలోచనతో ఓ పాత మిషన్ కొంటాడు అంకాలు. ఆ మిషన్ ని బాగు చేసి పడవకి అమర్చడంలో భూషణ్ (లీలా వెంకటేష్ కొమ్ములి) సాయం చేస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న నగేష్ ఏం చేశాడు? అసలీ భూషన్ ఎవరు? అంకాలు, గంగయ్య మిషన్ బోటు తయారు చేయగలిగారా? ఈ వేటలో పైచేయి సాధించిదెవరు?

చిన్న సినిమాలకు కథే బలం. ప్రేక్షకుడిని లీనం చేయగలిగే కథతోనే నెట్టుకురావాలి. మరో మార్గం లేదు. పాత పాయింట్ ని మసిపూసి మారేడు కాయ చేసేద్దామంటే కుదరదు. అయితే ‘రేవు’ సినిమా ఈ దారినే ఎంచుకుంది. ఈ సినిమా కథ చాలా పాత టెంప్లెట్. ‘రేవు’ బ్యాక్ డ్రాప్ లో దానికో కొత్త కోటింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఎల్బీ శ్రీరామ్ చెప్పే హరికథతో కథ మొదలౌతుంది. ఇదేదో ఎపిక్ అన్నట్టుగా రామాయణం కంటే గొప్పకథ, రోమాలు నిక్కబొడిచే కథ అనే వాయిస్ ఓవర్ తో పాలరేవు పాత్రలు ఓపెన్ అవుతాయి. అక్కడేదో పెద్ద యుద్ధమే జరిగిపోయిందనే తీరులో నెరేటివ్ ని బిల్డప్ చేశారు. అవన్నీ చూశాక ప్రేక్షకుడిలో కూడా ఆసక్తి పెరుగుతుంది. ఆ పాలరేవు సంగతేమీటో చూడాలనే ఉత్సాహం కలుగుతుంది. అయితే మాటల్లో వున్న బరువు సన్నివేశాల్లో లేకుండాపోతుంది. అంకాలు, గంగయ్య పాత్రలు, వారి కుటుంబాలు, స్నేహితులు, సంఘర్షణలని ప్రభావంతంగా ఎస్టాబ్లెస్ చేయలేకపోయారు. భూషణ్ పాత్రతో ఆ కథ రివెంజ్ వైపు సాగుతుంది. అయితే ఆ రివెంజ్ లో మూర్ఖత్వమే కానీ ఎమోషనల్ టచ్ వుండదు.

ఫస్ట్ హాఫ్ వరకూ సన్నివేశాలు కొత్తగా లేకపోయినా ఆ రేవు బ్యాక్ డ్రాప్ లో ఏదోరకంగా కథనం ముందుకుసాగుతుంది. సెకండ్ హాఫ్ లో ఈ కథ పూర్తిగా దారి తప్పేస్తుంది. ‘రేవు’ అని టైటిల్ పెట్టి సైకో కథ చూపిస్తున్నారనే చిరాకు కూడా కలుగుతుంది. నగేష్ కొడుకులిద్దరి పాత్రలని తీర్చిదిద్దిన తీరు ఈ కథకు నాన్ సింక్. ఆ ఇద్దరి క్యారెక్టర్స్ స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య సైకో ఇజాన్ని బీట్ చేయగలిగేలా వుంటాయి. ఏ ఎమోషన్ లేని ఉన్మాదం అది. సెకండ్ హాఫ్ మొత్తంలో అనవసరమైన హింస తప్ప కథకు పనికొచ్చే డ్రామా లేదు.

ఈ సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాలు కూడా వున్నాయి. నటీనటులంతా తెరపై సహజంగా కనిపించారు. వంశీరామ్ పెండ్యాల, అజయ్ తో పాటు మిగతా అందరూ తమ పాత్రల్లో ఇమిడారు. వంశీరామ్ ఫైట్లు బాగా చేశాడు. క్లైమాక్స్ లో సుదీర్గంగా సాగే యాక్షన్ సీన్ లో ఎనర్జీని బాగా మెంటైన్ చేశాడు. సినిమా నిర్మాణంలో పరిమితులు కనిపిస్తాయి. అయితే ఉన్నంతలో మంచి అవుట్ పుట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నేపధ్య సంగీతం బావుంది. కెమరాపనితనం ఫ‌ర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా షార్ఫ్ గా ఉండాల్సింది. అంకాలు పెళ్లికి ఏదో గతం వున్నట్లు ఓ సీన్ వేశారు, అలాగే భూషణ్ కి కూడా ఓ బ్యాక్ స్టోరీ వున్నట్లు హింట్ ఇచ్చారు కానీ అవేవీ కథలో భాగం కాలేదు. కొన్ని డైలాగ్స్ బావున్నాయి.

టేకింగ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన దర్శకుడు హరినాథ్, కథ, కథనాలు, ఎమోషనల్ కనెక్షన్ పై కూడా ఫోకస్ చేసివుంటే ‘రేవు’లో వేట మరింత రక్తికట్టేది.

తెలుగు360 రేటింగ్: 2.5/5

-అన్వర్-

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రైతు భరోసాపై సర్కార్ కీలక ప్రకటన

రెండు లక్షల రుణమాఫీ పేరుతో హడావిడి చేసి రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ పదేపదే విమర్శలు చేస్తోంది. రైతు భరోసాను ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎవరికి రైతు...

సత్య.. ది వన్ అండ్ ఓన్లీ…

సునీల్ తర్వాత మళ్ళీ ఆలాంటి కమెడియన్ దొరుకుతాడా? అనే ప్రశ్నకు సమాధానంగా కనిపించాడు సత్య. సునీల్ ని ఇమిటేట్ చేస్తున్నాడనే విమర్శలని బిగినింగ్ లో ఎదురుకున్నాడు. ఆ విమర్శలలో కొంతం వాస్తవం కూడా...
video

దేవర ముందర బావ బావమరిది

https://www.youtube.com/watch?v=7QCGkkKiJOE 96 సినిమాతో డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ పేరు బయటికి వచ్చింది. ఆ సినిమా మ్యాజికల్ హిట్. తెలుగులో రిమేక్ మాత్రం సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు ప్రేమ్ కుమార్ నుంచి మరో సినిమా...

వేణుస్వామిపై కేసు – మూర్తి సక్సెస్

జాతకాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే వేణు స్వామిపై కేసు పెట్టాలని హైదరాబాద్ పదిహేడో మెట్రోలిపాలిటక్ కోర్టు జూబ్లిహిల్స్ పోలీసులను ఆదేశించింది. వేణు స్వామి మహా మోసగాడు అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close