రాడిన్ బ్లూ ప్లాజ్ హోటల్లో ఉన్న పబ్‌లో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడానికి ప్రయత్నించడంతో విషయం రాజకీయం అయిపోయింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి మేనల్లుడు ఉన్నాడంటూ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కూడా సంబంధం ఉందన్నారు. ఈ ఆరోపణలను రేవంత్ రెడ్డి వెంటనే అంది పుచ్చుకున్నారు.
” నా మేనల్లుడా ..నా సొంత అల్లుడా.. నా కొడుకా.. నా తమ్ముడా కాదు ఎవరైనా సరే అందరికి డ్రగ్ టేస్టులు చేపిద్దాం ఏవడు డ్రగ్స్ తీసుకుంటే వాడిని సూర్యపేటలో ఓక తల్లి వాల్ల కోడుక్కి ఇచ్చిన కంట్లో కారం పొడి ట్రీట్మెంట్ ఇద్దాం… నేను ఇప్పటికి రేడీ …కేటీఆర్, కేసీఆర్ బండి సంజయ్ రేడీ యా..?అని సవాల్ చేశారు. తనకు సంబంధించినంత వరకు ఎవరు డ్రగ్స్ అలవాటు పడినా వాళ్లను తానే బట్టలిప్పి కొడతానన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు దమ్ముంటే ఇప్పటికైనా వైట్ చాలెంజ్‌కు రావాలని సవాల్ చేారు. ఈడీ, ఎన్సీబీ, డీఆర్ఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో కేటీఆర్‌కు వైట్ చాలెంజ్ విసిరిన రేవంత్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. చివరికి కేటీఆర్ కోర్టుకెళ్లి రేవంత్ రెడ్డి అలాంటి ఆరోపణలు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఈ కేసులో రేవంత్ రెడ్డి పేరును కూడా ప్రచారంలోకి పెట్టాలని టీఆర్ఎస్ ప్రయత్నం చేసింది కానీ., దీన్ని మరింత ఒడుపుగా రేవంత్ రెడ్డి అందుకున్నాడు. రివర్స్ చాలెంజ్ విసిరారు. అంతే కాదు పబ్‌లో పట్టుబడిన ఓ ఏపీ మాజీ డీజీపీ కూతురు, నాగబాబు కూతురు పేర్లను జాబితా నుంచి కేటీఆర్ చెప్పడం వల్లనే తొలగించారని ఆరోపించారు. ఈ డ్రగ్స్ వ్యవహారం ఇంతటితో ఆగేలా లేదు. రేవంత్ ఈ అంశాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.