టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ హయాంలోనూ ఇంత భారీ విజయం లభించలేదు అని చంద్రబాబు తరచూ చెబుతున్నారు. ఆ విజయం 2024 ఏడాదే టీడీపీకి అందించింది. 2014లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ భవిష్యత్ డొలాయమానంలో పడింది. కానీ పదేళ్ల పాటు చేసిన పోరాట ఫలితం… జగన్ రెడ్డి స్వియ వినాశ పాలన ఫలితం.. పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలు కూడా కలసి వచ్చి టీడీపీకీ కనీ వినీ ఎరుగని విజయాన్ని తెచ్చి పెట్టాయి. అందుకే టీడీకీ 2024 నెవర్ బిఫోర్ వైభవం అందించిందని చెప్పుకోవచ్చు.
పొత్తులతో పోటీ చేసినా 90 శాతానికిపైగా స్ట్రైక్ రేట్ సాధించడం చిన్న విషయం కాదు. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం పసుపుమయం అయిపోయింది. ఇలాంటి విజయాన్ని చంద్రబాబు కూడా ఊహించలేకపోయారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో మరోసారి చూపించారని ఉప్పొంగిపోయారు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ఉనికి సమస్యలు ఎదుర్కొన్న చాలా పార్టీలు కనుమరుగయ్యాయి. అతి కొద్ది పార్టీలే బలమైన భావజాలంతో ప్రజల మనసుల్లో ముద్ర వేశాయి. అలాంటి పార్టీల్లో టీడీపీ ఒకటి అని 2024 నిరూపించింది.
తెలుగుదేశం పార్టీకి 2024 ఇచ్చిన ధైర్యం మరో ముఫ్పై ఏళ్ల పాటు ఉంటుందని అంచనా వేయవచ్చు. ఎందుకంటే తర్వాత నాయకత్వం కూడా ట్రాక్‌లోకి వచ్చింది. ఎన్నికల సమయంలో నారా లోకేష్ పోషించిన పాత్ర .. పార్టీని ట్రాక్ లోకి పెట్టేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇప్పటికే నారా లోకేష్ పార్టీపై గ్రిడ్ సాధించారు. భవిష్యత్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే టీడీపీ భవిష్యత్ కూ భరోసా కల్పించిన ఏడాదిగా 2024 నిలిచిందని అనుకోవచ్చు.