‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్(జీఎస్టీ)’ వివాదం వర్మ మెడకు గట్టిగానే చుట్టుకుంటోంది. సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదు మేరకు- జీఎస్టీ లో అసభ్యత, అశ్లీలత అంశాలున్నాయనీ, ప్రచార చిత్రాలు అశ్లీలంగా ఉన్నాయంటూ పోలీసులు ఐటీచట్టం కింద కేసులు నమోదు చేశారు. శనివారం వర్మ సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చిన వర్మ ని డీసీపీ రఘువీర్ సమక్షంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 గంటల వరకూ పోలీసు అధికారులు విచారించారు. ఈ సందర్భంగా విచారణ లో ఆయన చెప్పిన విషయాలు పచ్చి అబద్దాల్లా కనిపిస్తున్నాయి.
అందులో మొదటిది, – తాను సినిమాను ‘స్కైప్’ పరిజ్ఞానం ద్వారా దర్శకత్వం వహించానే తప్పసినిమా చిత్రీకరణ జరిగిన పోలండ్, ఐరోపాకి వెళ్లలేదంటూ వర్మ చెప్పడం.
మరి సినిమా పబ్లిసిటీ కి ఉపయోగించిన ఫోటోల్లో మియా మాల్కోవా పక్కన మీరు డైరెక్షన్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలున్నాయే అని పోలీసులు ప్రశ్నించారు. దానికి వర్మ సమాధానమిస్తూ, జీఎస్టీ చిత్రంలో నటించాలంటూ కోరేందుకు పోలండ్‌కు వెళ్లానని, ఆ సందర్భంగా తీసిన ఫోటో అది అంటూ వివరించారు.
పోలీసులు అర్థిక విషయాలుకూడా ప్రశ్నించారు. ఈ సినిమాకి ఎంత పారితోషికం తీసుకున్నారని అడిగారు.దీనికి మళ్ళీ “షాక్” ఇచ్చే సమాధానమిచ్చారు వర్మ. తనకు ఎటువంటి పారితోషికం ఇవ్వలేదని వర్మ చెప్పారు.
ఇక భారతీయ చట్టాల ప్రకారం ఇలా పోర్న్ తీయడం నేరమనే విషయానికి సమాధానమిస్తూ, ఆ సినిమా చిత్రీకరణ పోలండ్, ఐరోపాలో జరిగిందనీ, భారతీయ చట్టాలు వర్తించవని బదులిచ్చారు.
మొత్తానికి వర్మ చెప్పిన విషయాల్లో నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఈ చిత్రాన్ని పోలండ్‌లో తీసినప్పడు వర్మ అక్కడున్నారా? భారత్‌లోనే ఉన్నారా? అనేది తెలుసుకునేందుకు పాస్‌పోర్టును పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు