‘మీటూ’ ఉద్యమం.. బాగా ఉధృతంగా సాగుతోంది. బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఈ వివాదం ద్వారా బయటకు వచ్చాయి. నిజానికి చాలామంది ఇందులో వర్మ పేరు ఉంటుందనుకున్నారు. వర్మ పేరు ఏ కథానాయికా బయటపెట్టకపోవడం షాక్ ఇచ్చే విషయమే. ఇది వర్మకీ షాక్‌కి గురిచేసిందట. “మీటూలో అంతా నా పేరు ఉంటుందనుకున్నారు. నా గురించి ఒక్క కథానాయిక మాట్లాడకపోవడం బాలీవుడ్ వాళ్లనీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. పొద్దున్న లేస్తే తొడల గురించీ, అమ్మాయిల గురించీ చర్చిస్తుంటాను. అందుకే… వాళ్లెవ్వరూ నా పేరు బయటకు తీసుకురాలేదేమో“ అని తనదైన స్టైల్లో స్పందించాడు వర్మ.
”మీటూ ఉద్యమం మంచిదే. దీని ద్వారా ఏం సాధిస్తారన్నది పక్కన పెడితే.. చిత్రసీమలో ఇలాంటి సమస్య ఒకటి ఉందన్న విషయం జనాలకు అర్థం అవుతుంది. తాము ఎదుర్కుంటున్న సమస్యపై మాట్లాడేందుకు ఓ వేదిక దొరికినట్టవుతుంది. అయితే.. ఇలాంటి ఉద్యమాల వల్ల… ఇలాంటి సమస్యలు ఆగుతాయని నాకు అనిపించడం లేదు” అని తేల్చేశాడు వర్మ. మీటూలో తన పేరు లేకపోవడం పట్ల వర్మ కాస్త నిరుత్సాహానికి గురయ్యాడేమో అనిపిస్తోంది. దాన్ని కూడా పబ్లిసిటీ రూపంలో వాడుకునే ఛాన్సు మిస్సయ్యింది కదా?? అందుకు.