రాంగోపాల్ వర్మ ఏం చేసినా.. కొత్తగా ఉంటుంది కదా? ఇప్పుడు ఆయన వెరైటీగా ఓ అన్ స్కూల్‌ని స్థాపించబోతున్నాడు. ఇప్పటి వరకూ ఉన్న ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లకు ఇది భిన్నంగా ఉండబోతోందట. ఇక్కడ కొత్తగా ఏమీ చెప్పరట. ఎవరిలో ఉన్న టాలెంట్ ప్రకారం… వాళ్లని ఆయా రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తారట. ”నాకు చెప్పడంపై నమ్మకం లేదు. ఎందుకంటే నేను సినిమాల్లోకి రాక ముందు ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ‘శివ’తో రూల్స్ బ్రేక్ చేయడానికి కారణం. నాకు సినిమా రూల్స్ ఏంటో తెలియకపోవడమే. కెమెరాకు లెఫ్ట్ ఏంటి? రైట్ ఏమిటి? అనేదే సరిగా తెలిసేది కాదు. అలాంటప్పుడు ‘సినిమా డైరెక్షన్ ఎలా చేస్తాడు’ అని అందరూ అనుమానంగా చూసేవాళ్లు. స్కూలింగ్ పద్ధతి నాకు నచ్చదు. పదో తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్ రెండేసి యేళ్లు ఫెయిల్ అయినవాడ్ని. అందుకే `అన్ స్కూలింగ్` అంటూ కొత్త పద్ధతి ప్రవేశ పెట్టబోతున్నా. ఇక్కడ మామూలు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్‌లో చెప్పే పాఠాలు చెప్పం. పాత క్లాసిక్స్‌ని చూపించం. వాటిని భిన్నమైన శిక్షణ ఉంటుంది. ఈ స్కూల్‌కి సంబంధించిన వివరాలు మరో 20 రోజుల్లో ప్రకటిస్తాం” అంటున్నాడు.