దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను వదిలేలా లేడు. పవన్ కళ్యాణ్ ప్రతీ మూమెంట్ ని గమనించి తనదైన శైలిలో ఆయనపై ప్రసంశలు( శ్లేషం గ్రహిస్తే అవి సెటైర్లు) కురిపిస్తుంటాడు వర్మ.”ఉదయాన్నే పోర్న్ వీడియోలు చూసి దాన్నే చాలా గొప్పగా బహిరంగ ప్రకటనలు చేసుకునే వర్మ లాంటి వ్యక్తి గురించి నేను ఏం మాట్లాడను”అని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో వర్మ కు గట్టిపెట్టినా ఆయన మాత్రం మారడం లేదు. పవన్ కళ్యాణ్ పై ఆయన ట్వీట్ బాణాలు కొనసాగుతున్నాయి. తాజగా పవన్ కళ్యాణ్ ఒక లీడింగ్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వర్మకు అదనుగా దొరికింది. పవన్ కళ్యాణ్ కు ప్రకృతి ప్రేమికుడన్న సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ లో కూడా ఆయన కొన్ని విషయాలు ముచ్చటించాడు.
ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే.. ”నాకు మొక్కలంటే ప్రాణం. పొలంలో, ఓ గులాబీ కొమ్మ పాలిపోయినట్టు అనిపించింది. ‘మిగతావన్నీ బావున్నాయి. నువ్వు మాత్రం ఎండిపోతున్నావేరా! అంతకష్టమేం వచ్చిందీ’ అని ప్రేమగా నిమిరేవాడిని. ఒకట్రెండు రోజుల్లోనే ఆ కొమ్మకు కొత్త జీవం వచ్చింది. ఓసారి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామానికి వెళ్లాం. అక్కడ తీవ్రమైన నీటి సమస్య. పాతాళం దాకా తవ్వినా నీళ్లు పడలేదట. ఎందుకో, ఓ చోట కాలుపెట్టగానే…. నా మనసుకు గలగలల సవ్వడి వినిపించింది. మావాళ్లను పిలిచి తవ్వమని చెప్పాను. పుష్కలంగా నీళ్లు పడ్డాయి”ఇది పవన్ కళ్యాణ్ ఇంటర్ వ్యూలో చెప్పినట్లుగా ప్రింట్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ ఏ సందర్బం ఊదాహరించి ఈ మాటలు చెప్పారో కానీ,ఇప్పుడీ మాటలను తన పేస్ బుక్ లో పోస్ట్ చేసి, ”ముందే చెప్పను పవన్ కళ్యాణ్ దేవుడని. బాలాజీ, యాదాద్రి, భద్రాచల రాముడు, ఇలా దేవుళ్ళ స్థానంలో పవన్ కళ్యాణ్ ను రిప్లేస్ చేయాలి” అంటూ ఓ కామెంట్ పోస్ట్ చేశాడు వర్మ. ఆయన కామెంట్ లో శ్లేషం అర్ధం చేసుకున్న పవన్ ఫ్యాన్స్ వర్మ పై షరా మాములుగా విరిచుకుపడుతున్నారిప్పుడు.
I always believed he's God and I truly think Balaji,yadagirigutta swamy,Bhadrachalam Ramudu etc Gods should be replaced with P K pic.twitter.com/IhqtSz08G0
— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2017