ట్విట్టర్లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శృంగార చిత్రమ్ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) కథ ముగిసింది. మొన్నటి వరకూ జీఎస్టీ మద్దతుదారులు, వ్యతిరేక వాదులతో సరసాలు, విరసాలు కొనసాగించిన వర్మ ఇప్పుడు పూర్తిగా నాగార్జున సినిమా మీద దృష్టి పెట్టారు. పోలీస్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రస్తుతం ముంబైలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. “వర్మ యాక్షన్ ఫిల్మ్ కోసం ముంబైలో షూటింగ్ చేస్తున్నా. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. వుయ్ ఆర్ బ్యాక్” అని నాగార్జున ట్వీట్ చేశారు..దానికి థ్యాంక్స్ చెప్పడమో, సినిమా బాగా వస్తుందని అనడమో చేస్తే వర్మ ఎందుకు అవుతాడు. సంథింగ్ స్పెషల్ అండ్ సెన్సషనల్ పెప్ యాడ్ చేస్తారు కదా! అదే వర్మ చేశారు. “దర్శకుడిగా నా మొదటి సినిమా ‘శివ’తో నా కెరీర్‌కి కిక్ స్టార్ట్ ఇచ్చింది నాగార్జునే. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ… ఐ రియల్లీ నీడెడ్ సెకండ్ కిక్ ఆన్ మై బట్” అని నాగార్జున ట్వీట్‌ని కోట్ చేశారు. మళ్ళీ ఏమనుకున్నారో “హే నాగ్… నీతో పెద్ద హిట్ ఇవ్వకపోతే నీ ఫ్యాన్స్ అందరూ నన్ను కొట్టడానికి వెయిటింగ్ చేస్తున్నారు. నీ కిక్స్ అన్నీ మన సినిమాలో విలన్స్ కోసం రిజర్వ్ చెయ్యి. నీ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ కిక్స్ ని నా కోసం రిజర్వ్ చేస్తారు” అని డిస్కషన్ క్లోజ్ చేశారు. ఎలాంటి సినిమాలు తీసినా, ఏది తీయబోతున్నా ఇలాంటి పబ్లిసిటీ కొట్టడం మాత్రం వర్మకు మాత్రమే చెల్లుతుంది.