రాంగోపాల్ వర్మ దర్శకుడిగా ఒకప్పుడు అత్యుత్తమ చిత్రాలు తీసిన మాట వాస్తవమే కానీ, గత కొద్ది సంవత్సరాలుగా ఆయన చాలా చెత్త సినిమాలు తీసి అభిమానులను పోగొట్టుకున్నాడు. హిట్లు లేకపోయినా ఏదో రకంగా వార్తల్లో ఉండాలనే తపనతో, సోషల్ మీడియాలో ఏదో ఒక రకమైన ట్విట్ లు చేస్తూ, తన ఐడెంటిటీ క్రైసిస్ ని సంతృప్తి పరుచుకుంటున్నాడు. అయితే, తన విజ్ఞాన ప్రదర్శన కోసం చేసే ఆ ట్వీట్ లు కూడా ఒక్కో సారి బూమరాంగ్ అయి నెటిజన్ల చేత చీవాట్లు తింటున్నాడు.
ఇప్పుడు కూడా ఇలాగే ఒక ట్వీట్ చేసి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి తన ఇంటి ఆవరణలో జింకలను వేటాడుతూ, తుపాకితో కాల్చి చంపిన వీడియో ని పోస్ట్ చేసి, జింకను వేటాడి నందుకు సల్మాన్ ఖాన్ ని చట్టాలతో వేటాడుతున్న అదే పోలీసులు, కోర్టులు, తన ఇంటి ఆవరణలో జింకలను వేటాడుతున్న ఈయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవు అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. బహుశా సల్మాన్ ఖాన్ స్టార్ అయినందుకు ఆయనను పోలీసులు చట్టాలు వేటాడుతున్నాయేమో అంటూ ఒక నెటిజన్ సమాధానం ఇచ్చిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ, తను కూడా అదే అభిప్రాయంతో ఏకీభవించారు రామ్ గోపాల్ వర్మ.
అయితే మరి కొందరు నేతలు మాత్రం రాంగోపాల్ వర్మ అజ్ఞానాన్ని బయట పెట్టడమే కాకుండా ఆయనను ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. ఈ వీడియో లో ఉన్న వ్యక్తి భారతీయుడు కాదని, బంగ్లాదేశ్ కి చెందిన వాడని, 2015 సంవత్సరంలో ఆయనే స్వయంగా ఈ వీడియోను తన ఫేస్ బుక్ లో పెట్టాడని ఆధారాలతో సహా చూపిస్తూ, సల్మాన్ ఖాన్ ని వేటాడిన అదే పోలీసులు, కోర్టులు చర్యలు తీసుకోవడానికి ఆయన అదే భారతదేశం లో ని వ్యక్తి కాదని చురకలంటించారు. అయినా ఐదేళ్ల కిందటి వీడియో ని పట్టుకొని ఏదో కొత్త వీడియో ని కనుగొన్న వాడిలా పోజులిస్తున్నాడని మరికొందరు చురకలంటించారు.
పైగా సల్మాన్ ఖాన్ ని పోలీసులు, కోర్టులు ప్రశ్నించింది ఆయన వేటాడినందుకు కాదని, అసలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం ఏం చెబుతుందో చదువుకోవాలని హితవు పలికారు మరికొందరు. నిజానికి ఈ చట్టం భారతదేశంలో అంతరించిపోతున్న కొన్ని జంతువుల జాబితా తయారు చేసింది. ఇవి అంతరించి పోయే క్రమంలో ఉన్నాయి కాబట్టి వాటిని వేటాడడం నిషేధించింది. కాబట్టి అంతరించిపోతున్న కృష్ణ జింకలను వేటాడడం చట్టరీత్యా నేరం. అంతే తప్ప ఏ జింకను వేటాడి నా ఇదే రకమైన చట్టాలు వర్తిస్తాయి అనుకోవడం మూర్ఖత్వం. ఇదే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ కి గుర్తు చేస్తూ ఆయన అజ్ఞానాన్ని బయట పెడుతూ నెటిజన్లు దుమ్ము దులపడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏది ఏమైనా ఒకప్పుడు మా తెలుగు దర్శకుడు అంటూ సగర్వంగా రాం గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులు చెప్పుకునే స్థాయి నుండి, జీఎస్టీ వంటి పోర్న్ సినిమాలు తీసే స్థాయికి దిగజారి పోవడమే కాకుండా, హిట్ సినిమా తీయలేక పోతున్న తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు ఏదో రకంగా వార్తల్లో నిలవడానికి సోషల్ మీడియా ని ఎంచుకునే స్థాయికి పడిపోవడం, పైగా అక్కడ కూడా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుని చీవాట్లు తినడం నిజంగా శోచనీయం అని, రాంగోపాల్ వర్మ ఇప్పటికైనా మళ్లీ ట్రాక్ లొకి వచ్చి తన అభిమానులను అలరించే సినిమాలు తీస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
If Salman khan is being hunted by police and courts for hunting a deer in a forest,shouldn’t the same police and courts hunt this terrible bastard who’s practicing hunting in his own front yard ??? If at all there is justice I demand the police and courts to answer this pic.twitter.com/7taCgLx0gb
— Ram Gopal Varma (@RGVzoomin) January 28, 2020